Begin typing your search above and press return to search.

'దేవ‌దాస్‌' పై ప‌డ్డ బందిపోటు!?

By:  Tupaki Desk   |   25 Sep 2018 1:30 AM GMT
దేవ‌దాస్‌ పై ప‌డ్డ బందిపోటు!?
X
దేవ‌దాస్ వర్సెస్ థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ ..! నాగ్‌-నాని `దేవ‌దాస్‌`కి థ‌గ్స్(బందిపోట్లు) పోటీనా? అదెలా.. అంటే ఆ రెండు సినిమాల‌కు పోటీ ఏం కాదు కానీ - తెలుగు సినిమా `దేవ‌దాస్` రిలీజ్ రోజున‌ ఇండియాస్‌ మోస్ట్ ప్రెస్టేజియ‌స్ మూవీ `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` ట్రైల‌ర్‌ని థియేట‌ర్ ల‌లోకి రిలీజ్ చేయ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌ గా మారింది. అంటే సెప్టెంబ‌ర్ 27న దేవ‌దాస్ సినిమా రిలీజ‌వుతున్న మ‌ల్టీప్లెక్సుల్లో `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` ట్రైల‌ర్ సంద‌డి చేయ‌బోతోంద‌న్న‌మాట‌.

ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కూ చూడ‌ని విజువ‌ల్ గ్రాండియ‌ర్ మూవీ ఇది. ఏ ఇత‌ర సినిమాకి ఖ‌ర్చు చేయ‌నంత భారీ బ‌డ్జెట్ పెడుతున్నామంటూ య‌శ్‌ రాజ్ ఫిలింస్ సంస్థ ఇప్ప‌టికే ప్ర‌చారం చేస్తోంది. బాహుబ‌లిని కొట్టేలా అంత‌కుమించిన విజువ‌ల్ గ్రాండియారిటీతో `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్` చిత్రాన్ని నిర్మిస్తున్నామ‌ని ఊద‌ర‌గొడుతోంది. అందుకు త‌గ్గట్టే ఇటీవ‌లే లాంచ్ చేసిన లుక్‌ లు హైప్ పెంచాయి. ఇటీవ‌లే అమితాబ్ - అల్లా భ‌క్ష్‌ లుక్ - క‌త్రిన‌- సుర‌య్యా - స‌నా షేక్‌- జ‌ఫీరా పాత్ర‌ల ఫ‌స్ట్‌ లుక్‌ ని రిలీజ్ చేశారు. తాజాగా అమీర్‌ఖాన్ ఫిరంగి లుక్‌ ని రివీల్ చేశారు. భారీ కాస్ట్యూమ్స్‌ తో ఈ లుక్‌ ల‌న్నీ ఆక‌ట్టుకున్నాయి. సినిమాపైనా భారీ అంచ‌నాల్ని పెంచాయి. 1936 నాటి `కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్` అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని విజ‌య్ కృష్ణ ఆచార్య తెరకెక్కిస్తున్నారు.

థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌ ట్రైల‌ర్‌ ను ఈనెల 27న లెజెండ్‌ య‌శ్‌ చోప్రా బ‌ర్త్‌ డే కానుక‌గా చిత్ర‌బృందం ప్లాన్ చేసింది. అలానే దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 8న సినిమాను రిలీజ్ చేస్తున్నారు. పాథ్ బ్రేకింగ్ మూవీ ఇది. అందుకు త‌గ్గ‌ట్టే పాథ్‌ బ్రేకింగ్ ట్రైల‌ర్‌ ని లాంచ్ చేస్తున్నాం అంటూ చెబుతున్నారు. దీనిపై ఇప్ప‌టికే అమీర్ ఖాన్ ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల‌తోనూ మంత‌నాలు సాగించార‌ట‌. అయితే ఈ సినిమాని తెలుగు వెర్ష‌న్‌ లో రిలీజ్ చేస్తున్నారా? లేదా? తెలుగు ట్రైల‌ర్ ఏమైనా ప్లాన్ చేశారా? మ‌న మార్కెట్ వ‌ర్గాల నుంచి అలాంటి ప్ర‌య‌త్నాలు ఏవైనా సాగుతున్నాయా.. లేదా? అన్న‌ది ఇప్ప‌టివ‌ర‌కూ తెలీదు. అమీర్ ఖాన్ `ధూమ్ 3` తెలుగులోనూ చ‌క్క‌ని విజ‌యం సాధించిన నేప‌థ్యంలో `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌` లాంటి విజువ‌ల్ గ్రాండియ‌ర్ సినిమాని ఇక్క‌డా రిలీజ్ చేస్తార‌నే అంచ‌నా వేస్తున్నారు. అయితే య‌శ్ రాజ్ ఫిలింస్ ప్లానింగ్ ఏంటి అన్న‌ది మునుముందు రివీల్ అవుతుందేమో చూడాలి.