Begin typing your search above and press return to search.

ఒకే కథ-మూడు సినిమాలా?

By:  Tupaki Desk   |   23 May 2018 6:44 AM GMT
ఒకే కథ-మూడు సినిమాలా?
X
టాలీవుడ్ లో జరిగే కొన్ని విచిత్రాలు ఇలాగే ఉంటాయి. ఇవి అనుకోకుండా జరిగాయో లేక ప్లాన్ ప్రకారం ముందే సెట్ చేసుకున్నారో అర్థం కాదు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మూడు సినిమాల గురించి ఇలాంటి టాక్ ఒకటి నడుస్తోంది. అదే స్టోరీ లైన్. మెమరీ లాస్ అనే కాన్సెప్ట్ మీద ఒకే తరహా కథలతో ఇవి రూపొందుతున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు తేజ్ ఐ లవ్ యులో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మెమరీ లాస్ తో బాధ పడే పాత్రలో కనిపిస్తుందని సమాచారం. తన ఎదురే ఉన్నా కూడా తనను గుర్తుపట్టలేని ప్రేమికుడి పాత్రలో తేజుని కొత్త తరహా రోల్ లో దర్శకుడు కరుణాకరన్ తీర్చిదిద్దినట్టు తెలిసింది. మరోవైపు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పడి పడి లేచే మనసులో పైన దానికి రివర్స్ లో హీరో శర్వానంద్ కు ఆ లోపం ఉంటుందట. తేజ్ ఐ లవ్ యులో హీరో నెరవేర్చిన బాధ్యతను ఇందులో హీరోయిన్ సాయి పల్లవి టేకప్ చేస్తుందన్న మాట. వీటితో తెలుగు డబ్బింగ్ రూపంలో రానున్న మరో సినిమా కూడా ఇదే లైన్ మీద ఉంటుందని సమాచారం. కాకపోతే ఇదే ముందు విడుదల అయ్యే అవకాశం ఉంది కనుక పేరు ప్రస్తావించడం లేదు.

నిజానికి ఇలాంటివి గతంలో కూడా జరిగాయి. కళ్యాణ్ రామ్ పటాస్ జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ తక్కువ గ్యాప్ లో విడుదల అయ్యాయి. రెండింట్లో ఉన్న కామన్ పాయింట్ కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ అయిన హీరో ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం వల్ల మారిపోయి అప్పటి దాకా స్నేహంగా ఉన్న విలన్ల భరతం పట్టడం. ట్రీట్మెంట్ పరంగా రెండింటిలో చాలా వేరియేషన్ ఉంది కానక రెండూ హిట్ అయ్యాయి. ఇప్పుడు కూడా అలాగే జరగాలి అని కోరుకోవచ్చు. తప్పేమి లేదు. కానీ సదరు దర్శక రచయితలు పూర్తి అవగాహనతోనే ఇవి రాసుకున్నారా లేక ఒకరికి తెలియకుండా ఒకరివి క్లాష్ అయ్యాయా అనేది మాత్రం అనుమానమే. ఎందుకంటే వీటికి స్ఫూర్తి హాలీవుడ్ సినిమా కనక. ఈ మెమరీ లాస్ కాన్సెప్ట్ కి ఇంత లైఫ్ వచ్చేలా చేసింది మాత్రం దర్శకుడు మురగదాస్ అనే చెప్పాలి. గజినీలో సూర్య పాత్రను తీర్చిదిద్దిన తీరు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో సజీవంగా ఉంది. మరి ఇప్పుడు ఈ మూడు సినిమాల్లో తీసుకున్న పాయింట్ కూడా అదే కానక ప్రేక్షకుడు కూడా తన మెమరీ లాస్ ని ఉపయోగించి ఒకదానితో మరొకటి పోల్చకుండా దేనికవే విడిగా చూస్తే సమస్యే లేదు. లేదంటేనే ఉంది అసలు చిక్కు