Begin typing your search above and press return to search.

ఎనీ డౌట్స్? అంటున్న శ్రీదేవి కూతురు

By:  Tupaki Desk   |   19 Nov 2017 9:30 AM GMT
ఎనీ డౌట్స్? అంటున్న శ్రీదేవి కూతురు
X
అలనాటి అందాలతార శ్రీదేవి కూతురు జాహ్నవికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ అంతాఇంతా కాదు. ఆమె ఫొటో కనిపిస్తే చాలు క్షణాల్లో వేల షేర్లు. ధడక్ సినిమాతో ఆమె ఎంట్రీ ఇస్తుండడంతో యూత్ మరీ క్రేజ్ పెంచుకుంటున్నారు. రీసెంటుగా ఈ సినిమా ఫస్ట్‎లుక్ కూడా విడుదలైంది. అయితే... శ్రీదేవి అంటే అందంతో పాటు అభియనంలోనూ నిరూపించుకున్న నటి.. మరి జాహ్నవికి అంత సీనుందా అన్న అనుమానం చాలామందిలో ఉంది. అలాంటి అనుమానాలను పటాపంచలు చేసేలా జాహ్నవి కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టింది. అవి చూస్తే చాలు ఆమె పట్ల ఇంకా ఎవరికైనా డౌటుంటే అది తీరిపోతుందని అంటున్నారు ఆమె ఫాలోవర్లు.

తాను రీసెంటుగా చేసిన ఓ ఫొటోషూట్లోంచి కొన్ని ఫొటోలను జాహ్నవి సోషల్ మీడియలో షేర్ చేసింది. అందులో నవరసాలు పలికించేసిందీ కుర్రది. అమాయకత్వం - కోపం - బాధ - ఆవేదన - కొంటెతనం - చిలిపితనం వంటి అన్ని ఫీలింగ్సునూ చూపిస్తూ ఫొటోలను గుదిగుచ్చి పెట్టింది. ఈ ఫొటోలను చూసినవారంతా జాహ్నవి మళ్లీ ఇంకో శ్రీదేవేనని అంటున్నారు.

కాగా... ఇటీవలే ధడక్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. జాహ్నవి కూడా తన ఇన్‎ స్టాగ్రామ్ ద్వారా ఈ లుక్ పోస్ట్ చేసింది. ఇందులో హీరో హీరోయిన్లు రొమాంటిక్ లుక్ ‎తో దర్శనమిస్తుండటం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇషాన్ ఖట్టర్ ఇందులో హీరో. మరాఠి చిత్రం 'సైరాట్' కి ఇది రీమేక్‎. ఈ సినిమా వచ్చే సంవత్సరం జులై 6న రిలీజ్ చేస్తారని టాక్.