సుచరిత రెడ్డి మరో రంగమ్మత్త..!

Sun Feb 10 2019 18:34:43 GMT+0530 (IST)

బుల్లి తెరపై తనదైన శైలిలో ఆకట్టుకుంటూనే అవకాశం చిక్కినప్పుడు బుల్లి తెరపై తన సత్తా చాటుతున్న హాట్ యాంకర్ అనసూయ గత ఏడాది 'రంగస్థలం' చిత్రంలో రంగమ్మత్త పాత్ర పోషించి ఆకట్టుకున్న విషయం తెల్సిందే. రంగమ్మత్త పాత్రతో అనసూయ కు మంచి మార్కులు పడ్డాయి. ఒక గ్రామీణ మహిళ పాత్రలో అనసూయ నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు 'యాత్ర'లో కూడా అనసూయకు మరో మంచి పాత్ర దక్కింది. సుచరిత రెడ్డి పాత్రతో అనసూయ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రాజశేఖర్ రెడ్డి గారి గొప్పదనం చెప్పే విధంగా సినిమాకు హైలైట్ గా నిలిచిన మొదటి సీన్ లోనే అనసూయ కనిపించింది. డీ గ్లామర్ గా కనిపించినా కూడా అనసూయ ఈ చిత్రంలో మరోసారి తన నటన ప్రతిభను కనబర్చింది. సీరియస్ రోల్ లో చక్కని నటన కనబర్చి ఆకట్టుకుంది. ఈ చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో అనసూయకు చాలా హ్యాపీగా ఉంది. తాజాగా సోషల్ మీడియాలో సుచరిత రెడ్డి పాత్రను తనకు ఇచ్చినందుకు దర్శకుడు మహి వి రాఘవకు మరియు సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పింది.

రంగమ్మత్త పాత్ర మరియు సుచరిత రెడ్డి పాత్రలు పూర్తి విభిన్నమైనవి అయినా కూడా అనసూయ రెండు పాత్రలకు విభిన్నమైన రీతిలో నటించి మెప్పించింది. నటిగా ఈ రెండు పాత్రలు ఆమె కెరీర్ కు బిగ్ అస్సెట్ గా నిలుస్తాయని చెప్పుకోవచ్చు.