Begin typing your search above and press return to search.

హోమ్లీ అత్త సినిమాలో లెస్బియన్ సీన్లు?

By:  Tupaki Desk   |   23 Oct 2016 9:30 AM GMT
హోమ్లీ అత్త సినిమాలో లెస్బియన్ సీన్లు?
X
సీనియర్ హీరోయిన్ నదియా ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉంది. మిర్చి.. అత్తారింటికి దారేది తర్వాత హీరోయిన్ అమ్మ కేరక్టర్లకు నదియాను మించిన ఆప్షన్ మరొకళ్లు డైరెక్టర్లకు దొరకడం లేదు. తెలుగులో అయితే హోమ్లీ కేరక్టర్లకు కేరాఫ్ అడ్రస్ అయిపోయిన నదియా.. ఇప్పుడు మలయాళంలో 'తిరైక్కు వరాద కథై' అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే.. అందరూ ఫిమేల్ కేరక్టర్స్ తప్ప.. ఒక్క నటుడు కూడా కనిపించడు. హారర్ జోనర్ లో తెరకెక్కే ఈ చిత్రంపై అంచనాలున్నాయ్ కానీ.. అదే టైమ్ లో వివాదం కూడా పెరుగుతోంది.

హాస్టల్ లో ఉండే నర్సులు.. వారి మధ్య అనుబంధం పెరగడం.. లెస్బియన్ తరహా కల్చర్ కు అలవాటు పడ్డం లాంటి సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. సినిమాలో ప్రధానమైన రెండు మహిళా పాత్రలు పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి కూడా వస్తాయట. అందుకే ఈ చిత్రంపై వ్యతిరేకత పెరుగుతోంది. చివరకు సెన్సార్ వాళ్లు కూడా సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. కాంట్రవర్సియల్ సీన్స్ తొలగించాకే యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారట.

నదియా పాత్రకు ఈ లెస్బియన్ వివాదానికి సంబంధం ఏం లేదు. ఈమె పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుందంతే. అయితే.. తమ చిత్రం పూర్తిగా కామెడీ అనీ.. లెస్బియన్ సీన్స్ ఒకట్రెండు మాత్రమే.. అది కూడా మాటల్లో తప్ప వేరే ఏం ఉండని.. 'తిరైక్కు వరాద కథై' దర్శకుడు తులసీదాస్ చెబుతున్నాడు. దీపావళికి రిలీజ్ కానున్న ఈ చిత్రం మలయాళంలో సెన్సేషన్స్ సృష్టించే అవకాశాలున్నాయని టాక్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/