Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: రగ్డ్ అవతారంలో శ్రీ విష్ణు

By:  Tupaki Desk   |   6 Feb 2019 5:32 AM GMT
ఫస్ట్ లుక్: రగ్డ్ అవతారంలో శ్రీ విష్ణు
X
విభిన్న కథలు ఎంచుకుంటూ సినిమాలు చేసే టాలీవుడ్ హీరోలలో శ్రీవిష్ణు పేరును తప్పనిసరిగా చెప్పుకోవాలి. జయాపజయాలతో సంబంధం లేకుండా డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటాడు శ్రీవిష్ణు. ఇదే కోవలో ఈ యువ హీరో 'తిప్పరా మీసం' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను నిర్మాతలు రీసెంట్ గా విడుదల చేశారు.

శ్రీవిష్ణుకు ఉన్న పేరుకు తగ్గట్టే ఫస్ట్ లుక్ డిఫరెంట్ గా ఉంది. పొడవాటి గడ్డం.. మెలిదిప్పిన బుర్రమీసాలు.. ఎడమవైపు సగం పగిలి ఉన్న కూలింగ్ గ్లాసెస్ - అందులోంచి సగం కనిపిస్తున్న కన్ను.. నుదుటిపై చిందరవందరగా పడి ఉన్న జుట్టుతో ఫుల్ మాసుగా.. రగ్డ్ గా ఉన్నాడు. వీటన్నిటికి తోడుగా సల్మాన్ భాయ్ టైపులో షర్ట్ లేని అవతారం. ఫస్ట్ లుక్ పోస్టర్ డార్క్ కలర్స్ తో వేసిన పెయింటింగ్ లా ఉంది. ఇక టైటిల్ లోగో డిజైన్ కూడా క్రియేటివిటీ చూపించి మరీ తెలుగు ఇంగ్లీష్.. టైటిల్స్ మధ్యలో బుర్ర మీసాన్ని పెట్టారు.

ఈ సినిమాలో నిక్కి తంబోలి.. రోహిణి హీరోయిన్లుగా నటిస్తున్నాడు. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు. నారా రోహిత్ తో 'అసుర' చిత్రాన్ని తెరకెక్కించిన కృష్ణ విజయ్ 'తిప్పరా మీసం' సినిమాకు దర్శకుడు. రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట.