సాహో టీజర్లో స్పెషల్స్ ఇవేనట

Wed Jun 12 2019 15:12:34 GMT+0530 (IST)

రేపు ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్స్ గంటల కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. ఈ ఏడాదిలోనే మోస్ట్ వెయిటెడ్ మూవీస్ లో మొదటిదిగా వస్తున్న సాహో టీజర్ రేపు విడుదల కానుంది. ఫైనల్ కట్ ని చెక్ చేసుకుని టీం రెడీగా ఉన్నట్టు సమాచారం. ఇన్ సైడ్ టాక్ ప్రకారం టీజర్ మొత్తం భారీ యాక్షన్ తో కళ్ళు చెదిరిపోయే విజువల్స్ తో ఎడిట్ చేశారట. ప్రభాస్ పాత్ర రెండు షేడ్స్ లో ఉంటూ ఒకటి హీరోగా రెండోది విలన్ తరహాలో అనిపించే నెగటివ్ యాంగిల్ లో ఉంటూ అభిమానులకు స్వీట్ షాక్ ఇచ్చేలా ప్లాన్ చేశారట.అందరూ ఊహిస్తున్నట్టు కాకుండా ఇందులో ఏ రేంజ్ లో ట్విస్టులు ఉంటాయో సాంపిల్ రూపంలో ఇందులో చూపించబోతున్నట్టు తెలిసింది. ఇది విన్న ఫ్యాన్స్ ఆనందం గురించి ఊహించుకోవడం కూడా కష్టమే.  సో ప్రీ పాజిటివ్ టాక్ టీజర్ కు చాలా అనుకూలంగా ఉంది. రఫ్ కట్ చూసిన యువి సంస్థ సన్నిహితులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్ లో కొత్త సంచలనాలు ఖాయమని నమ్మకంగా చెబుతున్నారు.

ఆగస్ట్ 15 విడుదల కానున్న సాహో బిజినెస్ మీద ఈ టీజర్ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అందుకే గూస్ బంప్స్ ఇచ్చే సన్నివేశాలు కొన్ని ఇందులోనే పొందుపరిచినట్టు వినికిడి బాహుబలి 2 తర్వాత రెండేళ్ల గ్యాప్ తో చేస్తున్న మూవీ కాబట్టి సాహో మీద బయ్యర్లకు చాలా గురి ఉంది. తెలుగుతో పాటు హిందీ తమిళ్ కన్నడ మలయాళంలో ఒకేసారి విడుదల కానున్న సాహో విడుదల తేదీనాటికి టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలవబోతోంది