Begin typing your search above and press return to search.

విజయ్‌ ఫ్యాన్స్‌ మెంటలెక్కించేశారు

By:  Tupaki Desk   |   5 Feb 2016 11:30 AM GMT
విజయ్‌ ఫ్యాన్స్‌ మెంటలెక్కించేశారు
X
నిన్నరాత్రి కోలీవుడ్ ప్రేక్షకుల్లో చాలమందికి ఒకటే పని. ఇంకా చెప్పాలంటే పండగ లాంటిది. అర్ధరాత్రి కోసం చాలా ఆతృతగా వెయిట్ చేశారు. దీనికి కారణం కోలీవుడ్ స్టార్ హీరో ముద్దుగా ఇలయదళపతి అని ఫ్యాన్స్ పిలుచుకునే విజయ్ నటించిన 59వ సినిమా 'తెరి' టీజర్ ను.. సరిగా అర్ధరాత్రి 12గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పడమే. ఇలా టీజర్ రిలీజ్ అయిందో లేదో.. ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ అయిపోయింది. ఆ టీజర్ ని చూస్తూనే ఉన్నారు.

ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న విజయ్ ఫ్యాన్స్ అంతా ఇదే పనిలో ఉన్నారు. ఎంతగా అంటే.. రిలీజ్ అయిన పది గంటల్లోపు 10 లక్షల వ్యూస్ ని సొంతం చేసేసుకుంది 'తెరి' టీజర్. ఇప్పటివరకూ కోలీవుడ్ కే కాదు.. మొత్తం సౌతిండియాకి ఇదే రికార్డ్. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు చాలా వెనకబడి ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే.. రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ యంగ్ టైగర్ నాన్నకు ప్రేమతో టీజర్ రిలీజ్ అయిన తర్వాత.. 36వేల లైక్స్ సంపాదించినపుడు ఫ్యాన్స్ నానా హంగామా చేశారు. దీనికి కారణం బాహుబలి లైఫ్ టైంలో సంపాదించిన వ్యూస్(35వేలు)కంటే ఇది ఎక్కువ కావడం.

మొత్తానికి నాన్నకు ప్రేమతో టీజర్ కు 40వేల లైక్స్ వచ్చాయంతే. కానీ 'తెరి' మాత్రం ఈ రికార్డును అందుకోడానికి రెండు గంటలు కూడా పట్టకపోవడం ఆశ్చర్యకరం. ఇక బాహుబలి సాధించిన టోటల్ వ్యూస్ 1.3 కోట్లను అందుకోవడానికి కూడా.. 'తెరి' కి పెద్దగా టైం అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి.. విజయ్‌ ఫ్యాన్స్‌ మనకు మెంటల్‌ ఎక్కించేసినట్లేగా!!