Begin typing your search above and press return to search.

ట్రైల‌ర్ టాక్ : వేద‌న‌కు గుర‌య్యే త‌ల్లి క‌థ‌

By:  Tupaki Desk   |   10 Sep 2019 6:11 AM GMT
ట్రైల‌ర్ టాక్ : వేద‌న‌కు గుర‌య్యే త‌ల్లి క‌థ‌
X
అమెరికా కోడ‌లుగా ప్రియాంక చోప్రా (పీసీ) చిద్విలాసం గురించి తెలిసిందే. నిక్ జోనాస్ తో రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న పీసీ చాలా గ్యాప్ త‌ర్వాత `స్కై ఈజ్ పింక్` అనే చిత్రంతో అభిమానుల ముందుకు రాబోతోంది. సోనాలి బోస్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు సాగుతున్నాయి. సెప్టెంబ‌ర్ 13న టొరొంటో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింఫెస్టివ‌ల్ లో ప్రీమియ‌ర్ కి రెడీ అవుతోంది. అక్టోబ‌ర్ 11న సినిమా రిలీజ్ కానుంది. ఫ‌ర్హాన్ అక్త‌ర్- ప్రియాంక చోప్రా- జైరా వాసిమ్ త‌దిత‌రులు ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సిద్ధార్థ్‌ రాయ్ క‌పూర్- రోనీ స్క్రూవాలాతో క‌లిసి ఈ సినిమాకి పీసీ స‌హ‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. `ది స్కై ఈజ్ పింక్` తొలి పోస్ట‌ర్ ని ఇటీవ‌లే రిలీజ్ చేశారు. తాజాగా ట్రైల‌ర్ ని లాంచ్ చేశారు.

ట్రైల‌ర్ ఆద్యంతం పీసీ-ఫ‌ర్హాన్ మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింద‌ని అర్థ‌మ‌వుతోంది. యుక్త‌వ‌య‌సు ప్రేమ‌క‌థ‌తో పాటు కుటుంబ బంధాలు- అనుబంధాలు ఇతివృత్తంగా ఈ చిత్రం తెర‌కెక్కింద‌ని అర్థ‌మ‌వుతోంది. అంత‌కుమించిన ఓ ఎలిమెంట్ ఎమోష‌న్ ని రెయిజ్ చేస్తోంది. అదే ఈ ప్రేమ జంటకు జ‌న్మించిన చిన్నారి ఎదుర్కొనే అరుదైన ఆరోగ్య స‌మ‌స్య‌. దీనిని నిజ‌జీవిత కథ స్ఫూర్తి అని తెలుస్తోంది.

ఇది రియ‌ల్ లైఫ్ పై సినిమా. 18 వ‌య‌సులో ఐషా చౌద‌రి అనే యువ‌తి ఊపిరితిత్తుల‌కు సంబంధించిన అరుదైన వ్యాధి ప‌ల్మ‌న‌రీ ఫైబ్రాసిస్ తో చ‌నిపోయింది. ఐషా ఒక వ్య‌క్తిత్వ వికాస టీచ‌ర్. ఐషా లైఫ్ స్ట్ర‌గుల్.. త‌న కుటుంబం అనుభ‌వించిన క‌ష్టాల క‌థ‌తో తీసిన‌ సినిమా ఇది. ఐషా త‌ల్లి పాత్ర‌ అదితీ గా ప్రియాంక చోప్రా న‌టించింది. కూతురు ఐషా అనారోగ్యం వ‌ల్ల‌ ఆ త‌ల్లి ప‌డిన క‌ష్టం ఎలాంటిది? అన్న‌ది తెర‌పై చూపించారు. అలాగే ఫ‌ర్హాన్ తో పీసీ క్రేజీ ల‌వ్ స్టోరి ట్రైల‌ర్ లో ఆక‌ట్టుకుంది. ఇద్ద‌రు డైహార్డ్ ల‌వ‌ర్స్ ప్రేమ‌కు గుర్తుగా ఇద్ద‌రు పిల్ల‌లు జ‌న్మిస్తే.. అందులో కూతురు ఐషా పాత్ర‌లో జైరా వాసిమ్ న‌టించింది. ఊపిరితిత్తుల స‌మస్య‌తో బాధ‌ప‌డే టీనేజీ అమ్మాయిగా జైరా న‌ట‌న ఆక‌ట్టుకోనుంది. ఫ‌ర్హాన్- పీసీ- జైరా అద్భుత‌మైన పెర్ఫామెన్సెస్ తో మెప్పించారు. ఫ‌ర్హాన్ - ప్రియాంక జంట‌ వ‌య‌సు పెరిగే కొద్దీ మారుతున్న గెట‌ప్పుల్ని అద్భుతంగా చూపించారు. యుక్త‌వ‌య‌సు దాటాక నడివ‌య‌సులో ఆ ఇద్ద‌రూ ఎలా ఉన్నారు? అన్న‌ది ర‌క‌ర‌కాల మేక‌ప్ స్టైల్స్ మార్చి చూపించ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. పీసీ క‌థ‌ల ఎంపిక‌ ఏదైనా సంథింగ్ స్పెష‌ల్ గా ఉంటుంద‌ని దీనిని బ‌ట్టి మ‌రోసారి ప్రూవైంది. ఈ ట్రైల‌ర్ లో చూపించింది చాలా చిన్న పార్ట్‌. పెద్ద తెర‌పై చూసేప్పుడు ఇంకా హృద‌య వేదనను క‌లిగిస్తుంద‌ట‌.