Begin typing your search above and press return to search.

మేకింగ్: ప‌డి ప‌డిలేచే మ‌న‌సు

By:  Tupaki Desk   |   18 Oct 2018 6:45 AM GMT
మేకింగ్: ప‌డి ప‌డిలేచే మ‌న‌సు
X
శ‌ర్వానంద్ - సాయిప‌ల్ల‌వి జోడీ తెర‌ పై ఏ రేంజులో మ్యాజిక్ చేయ‌బోతున్నారు? అన్న‌దానికి ఇదిగో ఇదే ప్రూఫ్‌. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా కెమిస్ట్రీ ఓ రేంజులో వ‌ర్క‌వుటైంద‌ని ఇదివ‌ర‌కూ రిలీజైన పోస్ట‌ర్లు తెలిపాయి. టీజ‌ర్‌లో చూడ ముచ్చ‌టైన జంట‌గా క‌నిపించి మైమ‌రిపించారు. అమ్మాయి వెంట ప‌డే అబ్బాయిగా శ‌ర్వా చాలానే మ్యాజిక్ చేశాడు. సాయి ప‌ల్ల‌వి కొంటె య‌వ్వారం చ‌ర్చ‌కొచ్చింది.

మొత్తానికి ఫిదా బ్యూటీ మ‌రోసారి అంత‌కుమించిన టింజ్‌తో బ‌రిలోకి వ‌స్తోంద‌ని తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో చెబుతోంది. శ‌ర్వా- సాయి ప‌ల్ల‌వి న‌టిస్తున్న ఈ ప్రేమ‌కథ యునిక్ అని చెప్పేందుకు .. ఈ సినిమాలో కొన్ని ల‌వ్ సీన్స్ మ‌తిచెడేంత అందంగా కుదిరాయ‌నేందుకు ప్రూఫ్ గా ఈ మేకింగ్ వీడియో, టీజ‌ర్ స‌రిపోతాయంటే అతిశ‌యోక్తి కాదు.

`అందాల రాక్ష‌సి` సినిమాతోనే ప్రేమ‌క‌థా చిత్రం తీస్తే త‌న మార్క్ ఎలా ఉంటుందో హ‌ను రాఘ‌వ‌పూడి నిరూపించాడు. పాత్ర‌ల్లో ఇండెప్త్ .. ఇంటెన్స్ యాటిట్యూడ్‌ని చూపించ‌డంలో అత‌డి కంటూ ఓ స్టైల్ ఉంద‌ని అర్థ‌మైంది. అందుకే జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా అవ‌కాశాలు అందుకుంటున్నాడు. ప‌డిప‌డి లేచే మ‌న‌సు టైటిల్‌తోనే ఆక‌ట్టుకున్న చిత్ర‌బృందం, మేకింగ్ వీడియోతోనూ ఈ సినిమా కంటెంట్ హైలైట్ అని ప్రూవ్ చేసింది. ఆన్ లొకేష‌న్ ఎంత ఎంజాయ్ చేస్తూ ప‌ని చేశారో ఈ వీడియోలో చూపించారు. డిసెంబ‌ర్ 21న సినిమా థియేట‌ర్ల‌లోకి రానుంది. ఎస్‌.ఎల్‌.వి సినిమా సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.