Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఇదొక అనంతం..నువ్వొక అనంతం

By:  Tupaki Desk   |   22 Sep 2018 11:15 AM GMT
ట్రైలర్ టాక్: ఇదొక అనంతం..నువ్వొక అనంతం
X
తెలుగులో కొత్తతరం ఫిలిం మేకర్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ లతో ప్రయోగాలు చేస్తున్నారు. ఇక అదే కోవలో రానున్న చిత్రం 'ది డ్రిఫ్టర్'(దారి తెన్నూ లేని బాటసారి అని తెలుగులో అర్థం) ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. "కోటానుకోట్ల విశ్వాలు నీ చుట్టూనే ఉన్నాయి.. లేదు చావు... లేదు పుట్టుక.. ఇదొక అనంతం.. నువ్వొక అనంతం" అనే బ్యాక్ గ్రౌండ్ వాయిస్ తో మొదలౌతుంది ట్రైలర్. లాంగ్ కోట్ వేసుకుని హ్యాట్ తో ఉన్న ఓ మనిషిని మిస్టరీ ఏదో ఉంది అన్నట్టుగా వెనకనుంచి చూపిస్తారు. ఒక నది ఒడ్డున కారుమబ్బులు కమ్ముకుని వర్షం ఇక కురుస్తుందా అన్నట్టుగా ఉంటుంది ఆ మనిషి నిలుచుని ఉన్న ప్రదేశం.

ఇక హీరో ఏదో విషయంలో భయపడుతూ.. టెన్షన్ పడుతూ ఉంటాడు. హీరో తనని ఎవరో ఫాలో అవుతున్నాడని అనుకుంటూ ఉంటాడు. ఇక హీరో "నువ్వెవరు.. నన్నెందుకు ఫాలో అవుతున్నావు" అని గట్టిగా అంటాడు. "నేనెవరో చెప్తే నీకు అర్థం కాదు.. చెప్పినా అర్థం చేసుకునే పొజిషన్లో నువ్వు లేవు" అని అతని వాయిస్ వినిపిస్తుంది. మరో వైపు ఒక వింటేజ్ కారు హైవే మీద వెళ్తున్నట్టుగా చూపిస్తారు. "గుర్తుందా… ఇందాకా చెప్పాను… ఇప్పుడు నేను చెప్పేది ఏదీ అర్ధం కాదు… అన్ టిల్.." అంటూ సినిమా అక్టోబర్ 2018 రిలీజ్ అవుతుందని తెలిపారు.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇది స్టొరీ అనే విషయంలో డైరెక్టర్ ఎలాంటి క్లూ ఇవ్వలేదు. ఇక పుట్టుక... చావు.. అనంతం.. లాంటి ఫిలసాఫికల్ డైలాగ్ లు కొంతమందికే తప్ప అందరికీ అర్థం అయ్యేవి కావు. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తుంటే ఒక హాలీవుడ్ స్టైల్ థ్రిల్లర్ సినిమా తీసేందుకు ట్రై చేసినట్టుగా ఉంది. ఇక మీరు లుక్కేయండి. ఈ లుక్కులు.. మౌస్ క్లిక్కులు.. మీ పెదవిపై చిరునవ్వులు అన్నీ అనంతాలు..!