Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: ఇదిగిదిగో మహాలక్ష్మి

By:  Tupaki Desk   |   19 Oct 2018 5:46 AM GMT
ఫస్ట్ లుక్: ఇదిగిదిగో మహాలక్ష్మి
X
మిల్కీ బ్యూటీ తమన్నా పూర్తిగా మహాలక్ష్మి గా మారిపోయింది. తన పాత్రలో లీనమై ఫ్రాన్స్ లోని.. ప్యారిస్ నగరంలో లో.. ఈఫిల్ టవర్ ముందు ఫుల్ జోష్ తో డాన్స్ వేస్తోంది. ఎందుకు తమన్నాకు ఇంత ఉత్సాహం వచ్చింది? అసలెందుకు ఈఫిల్ టవర్ ముందు మెడలో ఒక పూలదండ వేసుకొని లంగా ఓణీల్లో నాటు డ్యాన్సు చేస్తోందని అనుకుంటున్నారా?

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యి కంగనా రనౌత్ కు అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టిన 'క్వీన్' సినిమాకు తెలుగు రీమేకే ఇది. కంగనా రనౌత్ పోషించిన పాత్రను ఈ సినిమాలో తమన్నా పోషిస్తోంది. ఈ సినిమా టైటిల్ 'దట్ ఈజ్ మహాలక్ష్మి'. '100% లవ్' సినిమాలో ఈ నాగ చైతన్య తో దట్ ఈజ్ మహాలక్ష్మి అనిపించుకుని ఒక పాట కూడా పాడించుకున్న తమన్నా ఇప్పుడు మరో సారి దట్ ఈజ్ మహాలక్ష్మి అని ప్రేక్షకుల చేత అనిపించుకునేందుకు రెడీ అవుతోంది. పోస్టర్ డిజైన్ కలర్ఫుల్ గా ఉంది.. టైటిల్ లోగో కూడా డిఫరెంట్ గా చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది.

అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మను కుమరన్ ఈ సినిమాను మీడియెంట్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కానీ పోస్టర్ అంతా భూతద్దం పెట్టి వెతికినా డైరెక్టర్ అనే పదం .. ఆయన ఎవరనే విషయం కనబడకపోవడం ఒక విశేషం. ఆయన సంగతి తేలేలోపు మీరు ఫస్ట్ లుక్ ను పరిశీలించండి.