Begin typing your search above and press return to search.

సునీల్ అంత దుర్మార్గుడు కాదంటున్న త‌మ్మారెడ్డి

By:  Tupaki Desk   |   27 July 2016 5:30 PM GMT
సునీల్ అంత దుర్మార్గుడు కాదంటున్న త‌మ్మారెడ్డి
X
సినీ ప‌రిశ్ర‌మ అంటే హిపోక్ర‌సీలు.. మొహ‌మాటాలు.. మెహ‌ర్బానీలు ఎక్కువ‌. ఉన్న‌దున్న‌ట్లు మాట్లాడే వాళ్లు త‌క్కువ‌మంది ఉంటారు. పైకి మాట్లాడేది ఒక‌టి. తెర‌వెనుక వ్యాఖ్యానం మ‌రొక‌టి. ఐతే ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ మాత్రం ఆ టైపు కాదు. ఆయ‌న ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడ‌తాడు. సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు పెట్టింది పేరైన త‌మ్మారెడ్డి జ‌క్క‌న్న ప్రి రిలీజ్ ఫంక్ష‌న్లో సునీల్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సునీల్ నిర్మాత‌ల్ని బాగా ఇబ్బంది పెడ‌తాడ‌ని తాను విన్న‌ట్లు ఆయ‌న ఈ వేడుక‌లో చెప్ప‌డం విశేషం.

సునీల్ త‌న నిర్మాత గురించి మాట్లాడుతుండ‌గా మ‌ధ్య‌లో మైకు తీసుకున్న త‌మ్మారెడ్డి.. ఈ మ‌ధ్య సునీల్ గురించి చాలామంది నిర్మాతల ద‌గ్గ‌ర చాలా చెడు మాట‌లు విన్నాన‌న్నారు. సునీల్ బాగా ఇబ్బంది పెడ‌తాడ‌ని చాలామంది త‌న ద‌గ్గ‌ర కంప్లైంట్ చేశార‌న్నారు. ఈ నేప‌థ్యంలోనే జ‌క్క‌న్న నిర్మాత సుద‌ర్శ‌న్ రెడ్డి త‌న‌ను క‌లిస్తే సునీల్ గురించి విచారించాన‌న్నారు. ఐతే ఆయ‌న మాత్రం సునీల్ బంగారం అని చెప్పార‌న్నారు. మొహ‌మాటానికి ఈ మాట అంటున్నాడేమో అని.. మ‌ళ్లీ మ‌ళ్లీ అడిగి చూశాన‌ని.. కానీ సునీల్ ఏ ర‌కంగానూ ఇబ్బంది పెట్ట‌లేద‌ని.. ఎంతో స‌హ‌క‌రించాడ‌ని ఆయ‌న చెప్పార‌ని త‌మ్మారెడ్డి అన్నారు. మొత్తంగా సునీల్ అంత దుర్మార్గుడు కాద‌ని తేలింద‌న్నారు. చివ‌ర‌గా నిర్మాత‌ల్ని ఇబ్బంది పెడ‌తున్నావా అని సునీల్ ను అడిగిన త‌మ్మారెడ్డి.. ఇప్ప‌టిదాకా ఇబ్బంది పెడితే పెట్టి ఉండొచ్చేమో కానీ.. ఇక‌పై పెట్ట‌డు అని ముగించ‌డం విశేషం.