తొలిప్రేమ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

Thu Dec 13 2018 21:52:24 GMT+0530 (IST)

ఈ జెనరేషన్ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో మొదట చెప్పుకోవాల్సింది దేవీ ప్రసాద్ పేరయితే ఆ తర్వాత వెంటనే గుర్తొచ్చే పేరు థమన్ దే. ఇద్దరిలో కనిపించే ఒక తేడా ఏంటంటే కన్సిస్టెన్సి.  దేవీ ఆల్బమ్స్ అన్నీ ఒక రేంజ్ లో ఉంటాయి. కానీ థమన్ భయ్యా విషయంలో అలా ఉండదు. ఒక సినిమాకు పాటలన్నీ పీక్స్ లో ఉంటే మరో సినిమాకు జస్ట్.. ఆర్డినరీ అనిపిస్తాయి.  కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం థమన్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తాడు.ఈమధ్యకాలంలో థమన్ అందించిన అల్బమ్స్ లో చార్ట్ బస్టర్ ఆల్బమ్ 'తొలిప్రేమ'. అదీ ఇదీ అని తేడాలేకుండా మొత్తం పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు 'తొలిప్రేమ' దర్శకుడు వెంకీ అట్లూరి సెకండ్ సినిమా 'Mr. మజ్ను' తో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు థమన్ నే సంగీత దర్శకుడుగా ఎంచుకున్నాడు.  దీంతో ఇప్పుడు అందరి దృష్టి 'Mr. మజ్ను' ఆడియోపై ఉంది.  ఈ సినిమా నుండి మొదటి సింగిల్ 'ఏమైందో' డిసెంబర్ 14 న రిలీజ్ కానుంది.  మరి ఈ మొదటి పాటతో 'తొలిప్రేమ' మ్యాజిక్ రిపీట్ చేస్తాడా లేదా అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

'Mr. మజ్ను' సినిమాతో విజయం సాధించాలని నాగార్జున తనయుడు అఖిల్ ఉవ్విళ్ళూరుతున్నాడు. ఇలాంటి లవ్ స్టొరీకి ఫీల్ గుడ్ మ్యూజిక్ తోడైతే అది సినిమా సక్సెస్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి మెగా హీరోకు ఒక సూపర్ ఆల్బమ్ ఇచ్చినట్టే అక్కినేని చినబాబుకు కూడా అలాంటి ఆల్బం ఇస్తాడో లేదో ఫస్ట్ సాంగ్ శాంపిల్ తోనే మనకు తెలిసిపోతుంది. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.