Begin typing your search above and press return to search.

#TTT త‌మ‌న్ మొద‌లెట్టేశాడుగా..

By:  Tupaki Desk   |   17 April 2018 12:48 PM GMT
#TTT త‌మ‌న్ మొద‌లెట్టేశాడుగా..
X
ప్ర‌స్తుతం టాలీవుడ్‌ లో త‌మన్ టైం న‌డుస్తోంది. గ‌త ఏడాది ఆరు సినిమాలు విడుద‌ల చేసిన త‌మ‌న్‌... ఈ ఏడాది ఇప్ప‌టికే ఐదు సినిమాలు విడుద‌ల చేసేశాడు. అందులో తొలిప్రేమ‌- భాగ‌మ‌తి వంటి హిట్లు కూడా ఉన్నాయి. అయితే ఊహించ‌ని విధంగా ద‌క్కిన అవ‌కాశంతో ఆనందంతో మునిగి తేలుతున్నాడు థ‌మ‌న్‌. అదే ఎన్‌.టీ.ఆర్‌- త్రివిక్ర‌మ్ సినిమాకి మ్యూజిక్ అందించే అద్భుత అవ‌కాశం రావ‌డం.

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తార‌క్ న‌టిస్తున్న సినిమాకి మొద‌ట్లో త‌మిళ కుర్ర మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌ ని తీసుకున్నారు. అయితే అనుకోని విధంగా ‘అజ్ఞాత‌వాసి’ డిజాస్ట‌ర్ కావ‌డం... అందులో అనిరుధ్‌ ఇచ్చిన మ్యూజిక్‌కి కూడా నెగిటివ్ మార్కులు ప‌డ‌డంతో మ‌రో ఆలోచ‌న లేకుండా అత‌న్ని ప‌క్క‌న‌పెట్టాడు త్రివిక్ర‌మ్‌. అత‌ని స్థానంలో ప్ర‌స్తుతం ఊర ఫామ్‌ లో ఉన్న థ‌మ‌న్ ని ఎంపిక చేశాడు. ఊహించ‌ని భారీ ప్రాజెక్టు ద‌క్క‌డంతో ఆనందంలో మునిగిపోయాడు థ‌మ‌న్‌. ఎలాగైనా ఈ సినిమాని మ్యూజిక‌ల్ హిట్ చేయాల‌నే క‌సితో ట్యూన్స్ రూపొందించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాడ‌ట థ‌మ‌న్‌. మంచి సంగీతాభిరుచి ఉన్న త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో క‌లిసి మొద‌టి సారి ప‌నిచేస్తుండ‌డంతో క‌చ్చితంగా ఈ సినిమాతో మ‌రో మెట్టు ఎక్కాల‌ని అనుకుంటున్నాడు థ‌మ‌న్‌.

రాజ‌మౌళి- రామారావు- రామ్ చ‌ర‌ణ్ సినిమాకి #RRR పేరుతో పాపుల‌ర్ కావ‌డంతో మ‌నోడు కూడా తార‌క్‌- త్రివిక్ర‌మ్‌- థ‌మ‌న్ అంటూ #TTT పెట్టి చిన్న పోటీ కూడా పెట్టాడు సోష‌ల్ మీడియాలో. ఈ మ‌ధ్య‌నే రెగ్యూల‌ర్‌ షూటింగ్ మొద‌లుపెట్టిన ఎన్‌.టీ.ఆర్‌- త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.