మోహన్ బాబు నన్ను తిట్టినా అశీర్వాదమే

Mon Mar 12 2018 12:48:37 GMT+0530 (IST)

సీనియర్ నటుడు మోహన్ బాబు హీరోగా గాయత్రి అనే సినిమా ఈ మధ్యనే విడుదల అయిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు ముక్కుసూటి మనిషి అని తెలియని వారుండరు. ఆయన ఎవరి గురించి అయిన నిర్భయంగా మాట్లాడేస్తూ ఉంటారు. అలానే గాయత్రి సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన థమన్ గురించి మోహన్ బాబు చేసిన రిమార్కులు ఒకప్పుడు హాట్ టాపిక్."థమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు అన్న మాట నిజమే. నేనైతే తట్టుకోగలిగాను కానీ పని చేయడం చాలా కష్టం అతనితో. టాలెంట్ ఉంది కాని బాగా బద్ధకస్తుడు" అంటూ మోహన్ బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ కామెంట్స్ పైన చాలా రోజులు తర్వాత థమన్ ఇప్పుడు నోరు విప్పాడు. ఆయన మాటలను చాలా ఈజీగా తీసుకుని పాటలు ఇవ్వడం ఎందుకు లేట్ అయిందో కారణం చెప్పుకొచ్చాడు. సినిమాకు మంచి మ్యూజిక్ ఇవ్వాలి అనుకున్నాను కాబట్టి డిలే అయింది అన్నాడు. అంతేకాదు మోహన్ బాబు లాంటి పెద్ద మనిషి తిట్టినా అది అతనికి ఆశీర్వాదం కిందనే లెక్క అంటూ చక్కగా చెప్పాడు.

నిజానికి గాయత్రి సినిమాతో పాటు అదే వారంలో విడుదల అయిన మిగతా రెండు సినిమాలు వరుణ్ తేజ్ 'తొలి ప్రేమ' మరియు సాయి ధరమ్ తేజ్ 'ఇంటలిజెంట్' కు థమనే మ్యూజిక్ డైరెక్టర్. ఒకే వారం అన్ని సినిమాలు విడుదలకు ఉండడం వల్ల కొంచెం లేట్ అయిందని పైగా మంచి మ్యూజిక్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే అలా జరిగిందని చెప్పాడు థమన్.