Begin typing your search above and press return to search.

తమన్ డిఫరెంట్ గా కొట్టాడమ్మా

By:  Tupaki Desk   |   16 Jan 2018 6:32 AM GMT
తమన్ డిఫరెంట్ గా కొట్టాడమ్మా
X
సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ వరుసగా సినిమాలకు మ్యూజిక్ ఇచ్చేస్తుంటాడు. కెరీర్ ఆరంభంలోనే బడా హీరోల మూవీస్ కు కంపోజ్ చేసే ఛాన్స్ పట్టేసి సెన్సేషన్ సృష్టించిన ఈకంపోజర్.. ఈ మధ్య పెద్ద సినిమాల జోరు కాస్త తగ్గించినా.. సినిమాల స్పీడ్ మాత్రం బాగానే ఉంది. అయితే.. మొదటి నుంచి ఈ మ్యూజిక్ డైరెక్టర్ వినిపిస్తున్న విమర్శలు కొన్ని ఉన్నాయి.

ఒకే తరహా సంగీతం ఇస్తాడని.. నాలుగు కాలాలు వినదగ్గ ట్యూన్స్ ఇవ్వలేడని అంటూ ఉంటారు. ఇలాంటి విమర్శలు వినిపిస్తూనే ఉన్నా.. అదే తరహా మ్యూజిక్ ఇస్తూ విసుగెత్తించిన థమన్.. ఇప్పుడు వరుణ్ తేజ్ మూవీ తొలిప్రేమకు సంగీతం అందిస్తున్నాడు. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ చిత్రానికి ఇఫ్పుడు ఒక్కో లిరికల్ సాంగ్ చొప్పున రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే.. ఈ పాటలు వింటుంటే.. తమన్ నుంచి చాలా కాలం తర్వాత డిఫరెంట్ ఆల్బం వస్తోందనే సంగతి అర్ధమయిపోతుంది. ప్రతీ పాట విషయంలోను ఎంతో హృద్యంగా.. చెవులకు ఇంపుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు థమన్.

ఇంతకాలానికి ఈ కంపోజర్ నుంచి విభిన్నమైన ట్యూన్స్ రావడం.. అవి కూడా వినసొంపుగా మనసుకు హాయి గొలిపేలా ఉండడం చెప్పుకోదగ్గ విషయం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న తొలి ప్రేమ చిత్రంతో.. బ్లాక్ బస్టర్ ఆల్బం అందిస్తానని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు థమన్.