Begin typing your search above and press return to search.

పాపం తమన్.. అలా మిస్సయ్యాడు

By:  Tupaki Desk   |   23 Aug 2017 5:51 AM GMT
పాపం తమన్.. అలా మిస్సయ్యాడు
X
గతంలో ఓసారి 'రేసు గుర్రం' సినిమా ఈవెంటుకు వచ్చినప్పుడు.. మెగాస్టార్ చిరంజీవి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఆ టైములోనే దర్శకుడు సురేందర్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేసిన చిరంజీవి.. తరువాత తమన్ మ్యూజిక్ ను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 150వ సినిమాను దేవిశ్రీప్రసాద్ కు ఇచ్చిన చిరంజీవి.. తన తదుపరి సినిమా కోసం తమన్ ను ట్యూన్లు సిద్దం చేసుకోమని చెప్పారు. ఆ విధంగా చూస్తే 'ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి' సినిమాకు తమన్ కంపోజర్ అవ్వాల్సింది.

కాకపోతే ఉయ్యాలవాడ సినిమా అనుకన్నప్పుడు తమన్ తోనే ఈ సినిమాకు పాటలను కంపోజ్ చేయించాలని చూశారు. కాని ఆ సినిమాను అప్పుడు కేవలం తెలుగులో మాత్రం రూపొందించి తమిళంలోకి డబ్బింగ్ చేయాలని అనుకున్నారు. ఆ తరువాత బాహుబలి 2 సినిమా రిజల్ట్ చూశాక ప్లాన్స్ మారిపోయాయ్. ఆ రేంజులో ఉయ్యాలవాడ సినిమాను కూడా తీసుకెళ్లడానికి ఛాన్సులు ఉన్నాయని ఫీలైన చిరంజీవి అండ్ రామ్ చరణ్‌.. సినిమా రేంజును పెంచాలని డిసైడయ్యారు. దానితో ఇండియావైడ్ పేరున్న క్యాస్టింగ్ మరియు టెక్నీషియన్లను లైన్లోకి తెచ్చారు. మ్యూజిక్ కోసం ఏకంగా ఏ.ఆర్.రెహ్మాన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఒకవేళ ఈ 'సైరా' కనుక లోకల్ మూవీ అయ్యుంటే పాపం తమనే కొట్టేవాడు.. కాని గ్లోబల్ మూవీగా భారీ ఎత్తులో రిలీజ్ ప్లానింగ్ చేయాల్సి రావడంతో.. ఇతగాడ్ని తీసి పక్కన పెట్టారు.

కాని తనను అనుకున్న తరువాత సినిమా స్పాన్ పెరిగి దాని నుండి తనని తప్పించి రెహ్మాన్ వంటి దిగ్గజానికి ఇచ్చారనే బాధ ఏమాత్రం లేకుండా.. తమన్ మాత్రం నిన్న రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ కు రెహ్మాన్ కు టైమ్ లేదు కాబట్టి తనదైన శైలిలో అద్భుతంగా మ్యూజిక్ బ్రాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. చిరంజీవి తమన్ కు తదుపరి చేసే సినిమాను తప్పకుండా ఇస్తానని మాటకూడా ఇచ్చారట. గుడ్ లక్ తమన్!!