400 కోట్లతో `థాయ్ కేవ్ రెస్క్యూ` సినిమా

Thu Jul 12 2018 13:43:03 GMT+0530 (IST)

విహార యాత్రకు వెళ్లి థాయ్ లాండ్ గుహలో చిక్కుకున్న చిన్నారులు.....చనిపోయారని భావించిన వారు సజీవంగా ఉండడం..........దట్టమైన అడవి మధ్యలో భయంకరమైన గుహ.....చుట్టూ నీరు - చిమ్మ చీకటి - సన్నని ఇరుకైన మార్గాల్లో గంటల తరబడి గుహలో ప్రయాణం......భారీ వర్షాలతో గుహలోకి వెళ్లేందుకు ఆటంకం....వారికి సాయపడేందుకు వెళ్లిన డైవర్ మృతి...ఎట్టకేలకు 90మంది డైవర్లు ప్రాణాలకు తెగించి 13 మందిని కాపాడడం...హాలీవుడ్ సినిమాను తలపించే నాటకీయ పరిణామాలు. ఓ హాలీవుడ్ సినిమాను రూపొందించడానికి ఇంతకన్నా  అందుకే...ఈ ఉదంతాన్ని సినిమాగా తెరకెక్కించాలని ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్ టెయిన్ మెంట్ భావించింది. కావోస్ ఎంటర్ టెయిన్ మెంట్ కు చెందిన ఆడమ్ స్మిత్ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తానని ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్ టెయిన్ మెంట్ సీఈఓ మైఖేల్ స్కాట్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. దాదాపు రూ. 400 కోట్ల (సుమారు 60 మిలియన్ డాలర్లు) బడ్జెట్ తో ఆ సినిమా తెరకెక్కిస్తానని చెప్పారు. ఆ వాస్తవ కథ హక్కులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.గత నెల 23న థాయ్ లాండ్ లోని థామ్ లాంగ్ గుహలో చిక్కుకున్న 12 మంది జూనియర్ ఫుట్ బాల్ జట్టు సభ్యులను - కోచ్ ల కథ సుఖాంతం అయిన సంగతి తెలిసిందే. గుహలోకి  ప్రవేశించిన తర్వాత భారీ వరదల వల్ల గుహలోకి నీరు చేరడంతో వారంతా గుహ ముఖద్వారానికి 4 కిలోమీటర్ల దూరంలో చిక్కుకున్నారు. దీంతో అందులో చిక్కుకున్న 13 మందిని నిపుణులైన 90 మంది జాతీయ - అంతర్జాతీయ డైవర్ల రెస్క్యూ ఆపరేషన్ చేసి బయటకు తెచ్చారు. ప్రస్తుతం వారంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని కాపాడే క్రమంలో నేవీ సీల్ అధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 2 వారాలకు పైగా కొనసాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ ....లో ఎన్నో నాటకీయ పరిణామాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఉదంతంపై సినిమాను తెరకెక్కించేందుకు హాలీవుడ్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. రూ. 400 కోట్ల బడ్జెట్ తో `కేవ్ రెస్క్యూ`పేరుతో సినిమాను నిర్మించేందుకు ప్యూర్ ఫ్లిక్స్ ఎంటర్ టెయిన్ మెంట్ నిర్ణయించింది.