Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్ : నవ్వుల లాయర్ అల్లరి

By:  Tupaki Desk   |   15 Sep 2019 6:41 AM GMT
ట్రైలర్ టాక్ : నవ్వుల లాయర్ అల్లరి
X
ఇటీవలే వచ్చిన నిను వీడని నీడను నేనేతో డీసెంట్ హిట్ కొట్టిన సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బి. కామెడీ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకున్న జి నాగేశ్వర్ రెడ్డి దీనికి దర్శకుడు. కథ విషయానికి వస్తే కర్నూలులో కేసులు లేక చెట్టు కింద ప్లీడర్ లాంటి జీవితాన్ని నెట్టుకొస్తున్న తెనాలి రామకృష్ణ(సందీప్ కిషన్)కు రాక రాక వరలక్ష్మి కేసొకటి దొరుకుతుంది. అయితే అది చాలా కష్టమైనదని ఎవరు గెలవలేరని సీనియర్ న్యాయవాది(మురళి శర్మ)చెప్పినా రామకృష్ణ ధైర్యంగా ముందడుగు వేస్తాడు.

అతనికి అండగా నిలుస్తుంది ప్రియురాలు(హన్సిక మోత్వానీ). కానీ ముందుకు వెళ్లే కొద్దీ ఈ కేసులో చాలా విష వలయాలు ఉన్నాయని వాటితో ధీటుగా తన శాయశక్తుల ఒడ్డి పోరాడాల్సి ఉంటుందని రామకృష్ణకు అర్థమవుతుంది. మరి ఈ ఛాలెంజ్ ని ఎలా స్వీకరించాడు ఈ కేసుకు మరో మహిళా(వరలక్ష్మి శరత్ కుమార్)ఉన్న సంబంధం ఏంటి తదితర ప్రశ్నలకు సమాధానం సినిమాలోనే వెతుక్కోవాలి

టీజర్ సాంతం క్లీన్ కామెడీతో సాగింది. ఒక కేసు ఇస్తే రెండోది ఫ్రీ అని చెప్పడం క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇవ్వడం ఓడిపోతే 100% మనీ బ్యాక్ గ్యారెంటీ లాంటి స్కీములు పెట్టడం ఇలా రామకృష్ణ పాత్రను చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. అసిస్టెంట్ గా ప్రభాస్ శీను జడ్జ్ గా పోసాని ఇలా సీనియర్ ఆర్టిస్టులు అండగా నిలిచారు. సందీప్ కిషన్ మంచి టైమింగ్ తో కామెడీని పండించాడు. హన్సికను ఎక్కువగా రివీల్ చేయలేదు.

అయితే కథలోని యాక్షన్ పార్ట్ కు వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రకు ముడిపెట్టడం ఇంటరెస్టింగ్ గా ఉంది. నాగేశ్వర్ రెడ్డి అన్ని అంశాలను ఈసారి సరిగా బాలన్స్ చేసినట్టుయి కనిపిస్తోంది. సాయి కార్తీక్ సంగీతంతో ఛాయాగ్రహణం బాగా కుదిరాయి. త్వరలోనే విడుదల కానున్న తెనాలి రామకృష్ణ ఎల్ఎల్బి సందీప్ కిషన్ కు మరో బ్రేక్ వచ్చే ఛాన్స్ ఈ టీజర్ లో కనిపిస్తోంది