2018లో బడా సినిమాల జాతరే

Sat Dec 09 2017 15:17:14 GMT+0530 (IST)

ఈ ఏడాది కొంత మంది స్టార్ హీరోల సినిమాలు భారీ స్థాయిలో రిలీజ్ అయినా అన్ని సినిమాలు అంతగా సక్సెస్ అవ్వలేకపోయాయి. అయితే బిజినెస్ ల పరంగా టాలీవుడ్ స్థాయి ఈ ఇయర్ చాలా పెరిగిందని చెప్పాలి. ఇక గత నెలలో చిన్న సినిమాలు బాగానే సందడి చేశాయి. కానీ ఏ సినిమాలు పూర్తిగా సంతృప్తిని ఇవ్వలేకపోయాయి.కానీ 2018 మాత్రం టాలీవుడ్ ప్రేక్షకులకు సినిమాల జాతరే అనే విధంగా కొన్ని బడా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు అండ్ అల్లు అర్జున్ - రామ్ చరణ్ వంటీ స్టార్ హీరోలు వారి అభిమానులకు మంచి సినిమాలను అందించబోతున్నారు. వారు చేసే సినిమాలపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ముందుగా పవన్ కళ్యాణ్ - అజ్ఞాతవాసిగా వచ్చి సంక్రాంతికే జాతరను స్టార్ట్ చేయబోతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కడంతో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ తర్వాత మెగా హీరో రామ్ చరణ్ కూడా కొత్త తరహాలో తెరకెక్కిన రంగస్థలం సినిమాతో పాత కాలాన్ని కొత్తగా చూపించబోతున్నాడు. మార్చ్ 30న సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు - భరత్ అనే నేను అంటూ బాక్స్ ఆఫీస్ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఏప్రిల్ లో ఆ సినిమా రిలీజ్ కానుంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అదే నెలలో 27న నా పేరు సూర్యా అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భరత్ - సూర్యా అనే ఈ ఫైట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రేక్షకులకు కూడా ఆ సినిమాలు నచ్చే అవకాశం ఉంది.

అయితే ఈ నాలుగు సినిమాలతో పాటు ప్రభాస్ - సాహో అండ్ ఎన్టీఆర్ న్యూ మూవీ కూడా 2018లో వస్తే అందరి అభిమానులకే స్పెషల్ ఇయర్ అని చెప్పవచ్చు. పైగా అన్ని సినిమాలు కొత్తగా తెరకెక్కుతున్నాయి. మరి మనోళ్లు ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.