కత్తి గొడవను సెటిల్ చేసిన స్టార్ హీరో!

Sun Jan 21 2018 16:00:01 GMT+0530 (IST)

కొంత కాలం క్రితం వరకు సాధారణ ప్రజానీకానికి అసలు ఎవరో తెలియని కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ తో జరిగిన రచ్చ పుణ్యమా అని తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా సుపరిచితుడు అయిపోయాడు. దీనికి పలు న్యూస్ ఛానల్స్ బాగా దోహద పడ్డాయి అన్నది నిజం. నిజానికి చిన్న గొడవగా మొదలైన ఈ ఇష్యూ ఇంత తీవ్ర రూపం దాల్చడానికి పవన్ మౌనం కూడా ఒక కారణం అనే పాయింట్ ని పూర్తిగా ఖండించలేం. ఒకవేళ దీనికి స్పందన ఏదైనా నేరుగా బయట మాట్లాడి ఉంటే కూడా ఇది ఇంకా పెద్దది అయ్యేది అనే కామెంట్ కూడా కొట్టిపారేయలేనిదే. అసలు ఎప్పుడో సాల్వ్ అవుతుంది అనుకున్న సమస్య కత్తి మహేష్ పై కోడి గుడ్ల దాడి జరిగిన 24 గంటల లోపే పరిష్కారం కావడం పట్ల ఫాన్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసారు.కాని విశ్వసనీయ సమాచారం మేరకు ఇది సామరస్యపూర్వకంగా పరిష్కారం కావడంలో ఒక అగ్ర హీరో కీలక పాత్ర పోషించినట్టు టాక్. పవన్ కు బాగా కావాల్సినవాడైన ఆ హీరో జరుగుతున్నదంతా కొంత కాలం నుంచి గమనిస్తూ ఇది పూర్తి శృతి మించి పవన్ ఇమేజ్ తో పాటు జనసేన కు కూడా బాగా డ్యామేజ్ జరిగేలా మారుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఒక మినిస్టర్ ద్వారా రాజీ ప్రయత్నం చేసేలా పావులు కదిపారట. మొదటిలో బెట్టు చేసిన కత్తి మహేష్ అందరు పర్సనల్స్ లోకి వెళ్ళడం మొదలు పెడితే అనవసరంగా అందరికి చెడ్డ పేరు వస్తుందని చెప్పడంతో ఇది కాస్త సింపుల్ గా సాల్వ్ అయ్యిందని టాక్.

పవన్ ఫాన్స్ - కత్తి మహేష్ ఒకరికొకరు సెల్ఫీలు దిగటం - కలిసి పార్టీ చేసుకోవడం - నిన్న ఒక న్యూస్ ఛానల్ లో లైవ్ లో పవన్ ఫాన్స్ కత్తి మహేష్ కి శాలువా కప్పి పూల దండతో సన్మానం చేయటం ఇదంతా ఇప్పటికే హద్దులు మీరిన ఈ వివాదానికి చెక్ పెట్టడానికేనట. తనకు ఈ ఫేవర్ చేయమని పవన్ అడగనప్పటికి తనకు ఉన్న అనుబంధంతో ఆ అగ్ర హీరో దీన్ని పరిష్కారం దిశగా నడిపించినట్టు టాక్. ఇదంతా నిజమనే ఖచ్చితమైన ఆధారాలు లేవు కాని ఫిలిం నగర్ లో  జరుగుతున్న చర్చల్లో ఇవే ముఖ్యంగా ఉంటున్నాయి.