Begin typing your search above and press return to search.

సరదాగా కోట్లు పోగొట్టుకున్నారట!

By:  Tupaki Desk   |   17 Aug 2017 8:38 AM GMT
సరదాగా కోట్లు పోగొట్టుకున్నారట!
X
సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన ముగ్గురు స్నేహితులు కలిసి సినిమాల మీద మక్కువుతో ఓ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు. స్టార్ హీరోలతో సినిమాలు చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఆరంభ శూరత్వం అనే రీతిన మొదట్లో ఆ ముగ్గురు నిర్మాతలు తీసిన సినిమాలు ఇండస్ట్రీ రికార్డులు కొట్టాయి. దీంతో మితిమీరిన బడ్జెట్ తో సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు.

కట్ చేస్తే వరుస ఫ్లాపులు ఆ ప్రొడక్షన్ హౌస్ ను పలకించడం మొదలుపెట్టాయి. అయినా సరే సినిమా సినిమాకి ఫైనాన్షియర్లని మారుస్తూ భారీ సినిమాల్ని మాత్రం తియ్యడం ఆ నిర్మాణ సంస్థ మానలేదు. ఓ స్టార్ హీరోతో సినిమాలు తీసి వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న ఆ నిర్మాణ సంస్థ ఇటీవల మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు నిర్మించడం స్టార్ట్ చేసింది. అయితే రామేశ్వరం వెళ్లిన శనీశ్వరం తప్పనట్లు స్టార్ల్ తో సినిమాలు తీసినా మీడియం రేంజ్ వాళ్లతో సినిమాలు తీసినా ఆ నిర్మాణ సంస్థకి ఫ్లాపులు తప్పడం లేదు. అయితే ఈ ఫ్లాపులు రావడానికి కారాణాలు చాలానే ఉన్నాయని సినీ జనాలు చెబుతున్నాయి. ఆ ముగ్గురు నిర్మాతలు అవసరం లేకపోయినా ఫారిన్ లో సినిమా షూట్ చేయాల్సిందిగా అలానే సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తూ దెబ్బ తింటున్నారని తెలిసింది

ఇప్పటివరకు చాలా కోట్లకి పైగా ఆ ముగ్గురు నిర్మాతలు పొగొట్టుకున్నారని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మరి ఫ్యూచర్ లోనైనా ఆ ముగ్గురు నిర్మాతలు తమ లోపాల్ని సరిద్దిద్దుకుంటే టాలీవుడ్ నుంచి ఓ బడా నిర్మాణ సంస్థ తెరమరుగు కాకుండా ఉంటుంది.