Begin typing your search above and press return to search.

పవన్ వల్ల ఆ నిర్మాతకు కష్టాల?

By:  Tupaki Desk   |   24 Nov 2017 5:16 PM GMT
పవన్ వల్ల ఆ నిర్మాతకు కష్టాల?
X
సినిమా ఇండస్ట్రీలలో నిర్మాతలకు ఉండే కష్టాలు అన్ని ఇన్ని కావు. నమ్మకంతో సినిమాపై పెట్టుబడి పెడితే ఆ డబ్బు తిరిగి వస్తుందో రాదో ఎవరికి తెలియదు. ముఖ్యంగా అప్పులు చేసి సినిమా తీసే నిర్మాతల కష్టాలు కూడా వర్ణనాతీతం. సినిమా షూటింగ్ పూర్తవ్వగానే ఫైనాన్షియర్స్ వేధింపులు మొదలవుతూనే ఉంటాయి. పైగా చక్ర వడ్డీలతో ఇచ్చిన అప్పులు అవి. సినిమాకి ఏమైనా అమ్ముడు పోతేనే అప్పులు తీర్చవచ్చు.

ఇక అసలు విషయానికి వస్తే రీసెంట్ గా ఓ చిత్ర నిర్మాత పవన్ కళ్యాణ్ నిర్ణయం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాడాట. గతంలో ఆయనతో ఒక భారీ సినిమాను తీసిన కోలీవుడ్ ప్రముఖ నిర్మాత రీసెంట్ గా ఒక టాలీవుడ్ హీరోతో సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ సినిమాకు బిజినెస్ లేక డిస్ట్రిబ్యూటర్స్ కొనడానికి ముందుకు రావడం లేదు. గత కొంతకాలంగా ఆ సినిమా విడుదల తేది కూడా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో ఫైనాన్షియర్స్ తీసుకున్న డబ్బు మొత్తం చెల్లించాలని ఆయనను వేదిస్తున్నారట.

అయితే పవన్ విషయానికి వస్తే.. ఈ నిర్మాతతో ఒక సినిమాను తిస్తానని పవన్ ఎపుడో చెప్పాడు. ఆయన నెక్స్ట్ సినిమా తీయడానికి రెడీగా ఉంటే షూటింగ్ కి ముందే బిజినెస్ మొదలవ్వడానికి ఆస్కారం వుంటుంది. దీంతో పవన్ సినిమాను చేయడానికి ఆ నిర్మాత రెడీగా ఉంటారు కాబట్టి. ప్రస్తుతం రిలీజ్ కు నోచుకోని సినిమాను రిలీజ్ చేయడానికి ఆస్కారం ఉంటుందట. ఫైనాన్షియర్స్ కూడా సహాయం చేస్తారట కానీ పవన్ త్రివిక్రమ్ సినిమా తర్వాత అసలు సినిమాలు తీస్తాడా అనే విషయంపై క్లారిటీ లేదు. దీంతో ఫైనాన్షియర్స్ కూడా ఏమి చేయలేని పరిస్థితి. మరి ఆ నిర్మాత ఎలా బ్రతికిబయటపడతాడో..