డిసెంబర్ లో డిష్యుం డిష్యుం!

Mon Oct 22 2018 23:00:01 GMT+0530 (IST)

దసరా - క్రిస్మస్ - సంక్రాంతి అంటూ సీజన్ల పై కన్నేసి - స్కూల్ - కాలేజ్  సెలవుల్ని క్యాష్ చేసుకునేందుకు మన నిర్మాతలు ప్రణాళికల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. దసరా రేస్లో మూడు సినిమాలు రిలీజై సేఫ్ గేమ్ ఆడాయి. ఇక నెక్ట్స్ దీపావళి రేస్ లో తెలుగు సినిమాలేవీ లేవు కానీ తమిళ సినిమా `సర్కార్` రిలీజ్ కి రెడీ అవుతోంది. అటుపై క్రిస్మస్ బరిలో మాత్రం ఓ మూడు తెలుగు సినిమాలు బరిలో దిగుతున్నాయి.డిసెంబర్ 21న ఆ మూడు సినిమాల రిలీజ్ తేదీలు ఖరారయ్యాయి. శర్వానంద్ - సాయిపల్లవి జంటగా నటించిన `పడిపడి లేచే మనసు` - వరుణ్ తేజ్ - సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ మూవీ `అంతరిక్షం 9000 కెఎంపిహెచ్` - మమ్ముట్టి- మహి.వి రాఘవ్ కాంబినేషన్ మూవీ `యాత్ర` ఎంతో క్రేజీగా రిలీజవుతున్నాయి. ఈ మూడు సినిమాలు మూడు డిఫరెంట్ కాన్సెప్టులతో రూపొందుతున్నవే. మూడూ క్రేజీ సినిమాలే.. స్టఫ్ ఉన్న సినిమాలే కావడంతో అంచనాలు పెరిగాయి. ఒకటి బయోపిక్ - ఒకటి స్పేస్ బ్యాక్ డ్రాప్ మూవీ - ఇంకొకటి లవ్ స్టోరి కావడంతో వేటికవే ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.

కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే ముందే - 31 రాత్రి పార్టీకి ముందే.. వరుణ్ తేజ్ ట్రీట్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్. టాలీవుడ్ లో తొలి స్పేస్ బ్యాక్ డ్రాప్ మూవీ కావడంతో క్యూరియాసిటీ నెలకొంది. వైయస్సార్ బయోపిక్ ట్రీట్ కోసం తెలుగు ప్రజల్లో వైయస్ అభిమానులంతా వేచి చూస్తున్నారు. మరోవైపు వరుస విజయాలతో దూకుడు మీదున్న శర్వా - సాయిపల్లవి ట్రీట్ కోసం ఫ్యాన్స్ వెయిటింగులో ఉన్నారు. అందుకే ఈ మూడు సినిమాల బాక్సాఫీస్ విజయాల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ మధ్యలోనే నవంబర్ 29న 2.ఓ ట్రీట్ గురించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.