Begin typing your search above and press return to search.

ఆవు... పులి.. మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్లి

By:  Tupaki Desk   |   5 Oct 2015 9:30 AM GMT
ఆవు... పులి.. మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్లి
X
తెర‌కెక్కే సినిమాలు ఎన్ని అనేది ప‌క్క‌న‌పెడితే ఫిల్మ్ ఛాంబ‌ర్‌ లో మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు ఇంట్రెస్టింగ్ టైటిల్స్ న‌మోద‌వుతుంటాయి. క‌థ సంగ‌తి త‌ర్వాత... ముందుగా ఒక ఆస‌క్తిక‌ర‌మైన టైటిల్ ఏదైనా త‌ట్టిందంటే చాలు, వెంట‌నే రిజిస్ట‌ర్ చేసేస్తుంటారు. ఆ టైటిళ్ల ఆధారంగా క‌థ‌లు రాయించేస్తుంటారు. ఇటీవ‌ల ఫిల్మ్ చాంబ‌ర్‌ లో రిజిస్ట‌ర్ అయిన కొన్ని టైటిళ్లు ఆస‌క్తిక‌రంగా అనిపిస్తున్నాయి. `ఆవు... పులి.. మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్లి` - `ఆటాడుకుందాం రా` - `రోగ్` - `మా అమ్మ సీతామాల‌క్ష్మి` - `భోగి... ఆనందంగా ఉండేవాడు` - `సెకండ్‌ న మా పెళ్లి... ఫ‌స్ట్ నైట్‌ కి రండి`... త‌దిత‌ర టైటిళ్లు న‌మోద‌య్యాయి. వీటిలో `ఆటాడుకుందాం రా` టైటిల్ సుశాంత్ కోసం రిజిస్ట‌ర్ చేశారు. సుశాంత్ ప్ర‌స్తుతం జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకే ఈ టైటిల్ పెడుతున్నార‌ని స‌మాచారం. ఇక `రోగ్‌` - `మా అమ్మ సీతామాల‌క్ష్మి` పేర్ల‌ను పూరి న‌మోదు చేయించాడు. `రోగ్‌` సినిమాని ఓ యువ క‌థానాయ‌కుడితో తీయ‌బోతున్నాడు. `మా అమ్మ సీతామాల‌క్ష్మి` టైటిల్‌ ని వ‌రుణ్‌ తేజ్ సినిమా `లోఫ‌ర్‌`కి పెట్ట‌బోతున్నారు. లోఫ‌ర్ టైటిల్‌ పై విమ‌ర్శ‌లు రావ‌డంతోనే ఈ కొత్త టైటిల్‌ ని న‌మోదు చేయించారు.

దిల్‌ రాజు - ర‌వితేజ కాంబినేష‌న్‌ లో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. దానికోసం `భోగి... ఆనందంగా ఉండేవాడు` అనే పేరు పెట్ట‌బోతున్న‌ట్టు తెలిసింది. దిల్‌ రాజు పేరుతోనే ఫిల్మ్‌ ఛాంబ‌ర్‌ లో ఆ పేరు రిజిస్ట‌ర్ అయింది. కృష్ణ‌ముకుంద మురారి - సౌఖ్యం అనే పేర్లు కూడా న‌మోద‌య్యాయి. సౌఖ్యం అనే పేరు గోపీచంద్ సినిమాకి పెట్ట‌బోతున్నారు. కృష్ణ ముకుంద మురారి టైటిల్‌ తో వైవీయ‌స్ చౌద‌రి సినిమా చేయ‌బోతున్నారు. అలాగే `జూలియ‌ట్‌.. ల‌వ్ ఆఫ్ ఇడియ‌ట్‌` పేరుని శ‌ర్వానంద్ కోసం రిజిస్ట‌ర్ చేయించార‌ని తెలిసింది. ఇలా బోలెడ‌న్ని కొత్త పేర్లు ఫిల్మ్‌ న‌గ‌ర్‌ లో చ‌ర్చ‌ను లేవనెత్తుతున్నాయి. వీటిలో సెట్స్‌ పైకి వెళ్లేవి ఎన్నో, ఫిల్మ్‌ ఛాంబ‌ర్‌ లోనే ఆగిపోయేవి ఎన్నోచూడాలి.