దూసుకెళుతున్న తెలుగమ్మాయ్

Thu Dec 06 2018 12:20:24 GMT+0530 (IST)

తెలుగమ్మాయిలు తెలుగుతెర పైనా ఇరుగు పొరుగు నా మెరుస్తున్న సంగతి తెలిసిందే. బిందుమాధవి అంజలి తర్వాత శ్రీదివ్య ఆనంది నందిత లాంటి కథానాయికలు ఇరుగుపొరుగున రాణించినా  ఆ తర్వాత మళ్లీ ఆ వేవ్ కనిపించలేదు. ఈ గ్యాప్ లోనే హైదరాబాదీ బ్యూటీ ఇషా రెబ్బా టాలీవుడ్ తో పాటు ఇరుగు పొరుగు పరిశ్రమల్లోనూ వెలుగులు విరజిమ్మేందుకు సీరియస్ ప్రణాళికల్లో ఉంది. ఓ వైపు తెలుగు లో నటిస్తూనే తమిళం కన్నడలోనూ ఈ బ్యూటీ అవకాశాలు అందుకుంటోంది. తమిళ్ కన్నడలో ఇషా తొలి అడుగులు వేస్తున్నానని తెలిపింది.ఇషా నటించిన  థ్రిల్లర్ సినిమా `సుబ్రమణ్యపురం` ఈ శుక్రవారం రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో ఇషా పాత్రికేయులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సుబ్రమణ్యపురం లో తన పాత్ర గురించి తదుపరి ప్రాజెక్టుల గురించి ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేసింది. ``సుబ్రమణ్యపురం చిత్రం లో హీరో సుమంత్ పాత్రకు పూర్తి ఆపోజిట్ పాత్రలో .. దేవుళ్లను నమ్మే భక్తురాలి పాత్ర లో నటిస్తున్నానని ఇషా తెలిపింది. దేవుళ్లను అసలే నమ్మని కార్తీక్ (సుమంత్) అసలు దేవుళ్లు ఉన్నారా లేరా అంటూ దేవాలయాల పైనా పరిశోధన చేస్తుంటాడు.

దైవభక్తి తో నిరంతరం దేవుళ్ల చుట్టూ తిరిగే ప్రియ పాత్ర లో తాను నటిస్తున్నానని ఇషా చెప్పింది. ఇరుగుపొరుగు భాషల్లో అవకాశాల గురించి ప్రస్థావిస్తూ .. అందివచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నానని కెరీర్ ని  సీరియస్ గానే ప్లాన్ చేస్తున్నానని తెలిపింది. తమిళం లో జీవి ప్రకాష్ కుమార్ సరసన ఓ చిత్రం లో నటిస్తున్నా... అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ సరసన ఓ భారీ చిత్రం లో నటిస్తున్నానని ఇషా రెబ్బా ఇంటర్వ్యూలో వెల్లడించింది.

`అరవింద సమేత`లో సిస్టర్ పాత్ర సంతృప్తికరమేనా? అన్న ప్రశ్నకు.. తన పాత్ర విషయం లో ఎంతో సంతృప్తి చెందానని ఇషా తెలిపింది. ఈ చిత్రం లో ఎన్టీఆర్ సోదరిగా చేయడానికి కారణం .. తారక్ కోసం మాటల మాయావి త్రివిక్రమ్ కోసం చేశానని ఎలాంటి భేషజం లేకుండా ఇషా అంగీకరించింది. టాలీవుడ్ లో తన కెరీర్ పరంగా ఎలాంటి అసంతృప్తి లేదని ఈ ఏడాది చక్కని విజయవంతమైన చిత్రాల్లో నటించానని ఇషా చెప్పింది. అ! చిత్రంలోనూ సంతృప్తికరమైన పాత్రలో నటించానని వెల్లడించింది.