Begin typing your search above and press return to search.

ఆమె మత్తులో తేలుతుంది కాసుల కోసమా??

By:  Tupaki Desk   |   25 July 2017 11:50 AM GMT
ఆమె మత్తులో తేలుతుంది కాసుల కోసమా??
X
ఇప్పటికే చాలామంది ప్రముఖ సెలబ్రిటీలను ఎక్సయిజ్ మరియు ఎన్ఫోర్స్ మెంట్ శాఖ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో ఎక్సయిజ్ అధికారులు ఎటువంటి ఇన్ఫో మీడియాతో పంచుకోకపోయినా కూడా.. లోపల ఏం జరుగుతోంది అనే లీకులు ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. ఎంతసేపూ ఇక్కడ చాలామంది సెలబ్రిటీలు చేతిలో ఆఫర్లు లేక డ్రగ్స్ కు భానిసలై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అని ఒకే కోణం వినిపిస్తున్న తరుణంలో ఇప్పుడు మరో యాంగిల్ కూడా బయటకొచ్చింది.

నిజానికి ఒక తెలుగుపిల్ల కూడా ఈ మత్తు ఊబిలో చిక్కకుందట. కాకపోతే ఆమె డ్రగ్స్ ను వాడింది చాలా తక్కువేనట. కాని అమ్మడు మాత్రం తనకున్న పరిచయాలతో ఇతర సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేయిస్తోందని.. అలా ఈ మత్తుపదార్ధాలను చేతులు మార్చడం వలన మధ్యలో ఆమెకు కమిషన్ మిగులుతోందని.. దాని కారణంగా ఆమె చక్కగా చేతిలో సినిమాలు లేకపోయినా కూడా లగ్జరీ లైఫ్‌ స్టయిల్‌ వెళ్లదీస్తోందని కొన్ని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈమెకు సంబంధించి వాట్సాప్ చాట్లు వగైరా సరిగ్గా దొరకకపోవడంతో.. ఇంకా ఎక్సయిజ్ శాఖ ఈమెకు నోటీసులు ఇవ్వలేదట. సరైన ఆధారాలు దొరికిన వెంటనే.. డ్రగ్స్ పుచ్చుకుంటున్న ప్రముఖులపై ఎలాంటి చర్యలు ఉన్నా లేకపోయినా.. అమ్ముతున్న ఈమెను మాత్రం కోర్టు బోనెక్కిస్తారని ఒక కథనం వినిపిస్తోంది.

కొంతమంది మత్తుకు భానిస అవుతుంటే.. కొంతమంది ఆ కిక్కులో కూడా ఒక బిజినస్ పాయింటాఫ్‌ వ్యూ చూసి.. అందులో నుండి ఇలా సంపాదించుకుంటున్నారు అనమాట. ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా.. ఈ సెలబ్రిటీలు డ్రగ్స్ వాడారు అనేదానికంటే వీరు భారీ స్థాయిలో కొనుకగోలు చేసి ఇతరులకు పంచారు అనేదానిపైనే ఎక్కువగా అందుకే ఆరాలు తీస్తున్నట్లున్నారు.