Begin typing your search above and press return to search.

మోసపోయిన ఆ మెగా హీరో ఎవరు?

By:  Tupaki Desk   |   5 Aug 2017 8:23 AM GMT
మోసపోయిన ఆ మెగా హీరో ఎవరు?
X
మెగా కాంపౌండ్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు - ఫ్యాన్స్ వాటి కోసం విపరీతంగా ఎదురుచూస్తారు. అయితే వారి ఉత్కంఠను మరింత పెంచే వార్తొకటి ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ మధ్య చక్కర్లు కొడుతుంది. త్వరలోనే విడుదల కాబోతున్న ఓ మెగా హీరో సినిమాకి సంబంధించిన స్టోరీ ఇదేనంటూ ఓ కథ గురించి సినీజనాలు తెగ మాట్లాడుకుంటున్నారు. ఆ కథలో ఏ మెగా హీరో నటిస్తున్నాడే విషయం పక్కనపెడితే. స్టోరీలో మాత్రం హీరో తన ఫ్రెండ్ చెతిలో దారుణంగా మోసపోతాడని, అలా ఫస్ట్ హాఫ్ లో హీరో ఫ్రెండ్ గా నటించిన ప్రాతే సెకండ్ హాఫ్ లో విలన్ అవుతాడని తెలిసింది. ఈ డ్యూయల్ క్యారెక్టర్ లో ఓ ప్రముఖ నటుడు యాక్ట్ చేశాడని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇదే లైన్ తో గతంలో వచ్చిన కొన్ని సినిమాలు పెద్దగా ప్రజాదరణకి నోచుకోలేదు. ఇది ఇలా ఉంటే ఈ కథని ప్రస్తుతం హ్యాండిల్ చేసిన డైరెక్టర్ కి పెద్దగా ట్రాక్ రికార్డ్ లేదు. దీంతో ఆ మెగా హీరో ఈ సినిమా విషయంలో కాస్త టెన్షన్ పడుతున్నాడని సమాచారం. మరి ఆ మెగా హీరోకి ఫ్యాన్స్ నుంచి ఏ రేంజ్ లో సపోర్ట్ వస్తుందో చూడాలి.