Begin typing your search above and press return to search.

ఎప్పుడూ అవే సీన్లు, అదే బూతులు...

By:  Tupaki Desk   |   27 July 2015 11:16 AM GMT
ఎప్పుడూ అవే సీన్లు, అదే బూతులు...
X
బాహుబలి ఎంత పెద్ద హిట్టో... అందులో ప్రభాస్, తమన్నాల రొమాంటిక్ సీన్స్ అంతకంటే ఎక్కువ వివాదం అవుతున్నాయి. ఇప్పటికే అవంతికను శివుడు రేప్ చేశాడంటూ... ప్రచారం ఓ రేంజ్‌ లో ఉంది. సోషల్ మీడియాలో కూడా ఇదే హాట్ టాపిక్. ఈ అంశంపై జరిగినంత డిబేట్... రీసెంట్‌ గా దేనిమీదా జరలేదంటే అతిశయోక్తి కాదు. ఇదొక్కటే కాకుండా.... తెలుగు డైరెక్టర్లు సినిమాలు తీస్తున్న తీరును ఓ తెలుగమ్మాయి కడిగిపారేసింది. ఓ వీడియో చిత్రీకరించి సోషల్ సైట్లలో పోస్ట్ చేసింది. ఫేస్‌ బుక్, వాట్సాప్... ఇలాంటి తేడాలు ఆ వీడియో తెగ హల్‌ చల్ చేసేస్తోంది నెట్‌ లో.

మొదట బాహుబలి లోని అవంతిక డ్రస్ సీన్‌ తో ప్రారంభమైంది ఈ వీడియో. అంత గొప్ప మూవీ తీసిన రాజమౌళికి ఆడవారి మీద గౌరవం లేదా అంటూ అడిగింది. అత్తారింటికి దారేది లో... 60ఏళ్లఎంఎస్ నారాయణను... పవన్ కళ్యాణ్ కొట్టడం కరెక్టా అని ప్రశ్నించింది. అంతేకాదు దూకుడు లో... సమంతతో మహేష్ బాబు 'నీ కలరేంటి, నా కలరేంటి' అని అడగడాన్ని తప్పు పట్టింది. జనం ఇలాంటి వాటికి అలవాటు పడిపోయారా అంటూ నిలదీసింది ఈ వీడియో అమ్మాయి.

సత్యమూర్తి ఆడియో ఫంక్షన్లో సుమ, సమంతపై ఆలీ చేసిన వల్గర్ కామెంట్స్‌ పై పిచ్చకోపం వచ్చేసింది ఈ వనితకు. ఆలీని ఉద్దేశించి కొన్ని తిట్లు కూడా తిట్టేసింది. పండగ చేస్కో మూవీలో... 50ఏళ్ల బ్రహ్మానందం, 30ఏళ్ల సోనాల్ చౌహాన్‌ ని రేప్ చేసేందుకు ప్రయత్నించడం కామెడీయా అంటూ క్వశ్చన్ చేసింది.

హీరోలకు ఉండే కటౌట్స్... హీరోయిన్స్ ఎందుకు ఉండవని ప్రశ్నిస్తూనే.. జనాలు మంచి సినిమాలు చూస్తారని.. అందుకు లీడర్ లాంటి మూవీస్ ఉదాహరణలుగా చెప్పింది. సుకుమార్ లాంటి ఆలోచనలున్న డైరెక్టర్స్ మరింతమంది అవసరమన్న ఈ వీడియో చిన్నది... దర్శకులే కాదు... ప్రేక్షకులు కూడా కొన్ని తప్పులు చేశారని చెప్పింది. గగనం, ఖలేజా వంటి సినిమాలు హిట్ కాకపోవడానికి కారణం... జనాల తప్పేనంటోంది.

దేశంలో 48శాతం ఉన్న మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా సినిమాలు తీస్తున్న దర్శకులు... ఇకనైనా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. అన్ని భాషల్లోనూ ఈ సమస్య ఉన్నా... మనం తెలుగువారం కాబట్టి... తెలుగు గురించి మాట్లాడుతున్నా అంటూ వివరణ కూడా ఇచ్చింది. జనాలు మంచి సినిమాలు ఆదరిస్తే... దర్శకులు కూడా మంచి మూవీస్‌ తో ముందుకొస్తారని చెప్పింది.

ఈ వీడియోలో అమ్మాయి చెబ్తున్నది వింటుంటే... ప్రేక్షకులు, దర్శకులు.. రెండువైపుల నుంచి మార్పు అవసరమే అనిపిస్తోంది. తెలుగులో ఇంతగా వేడుకున్న ఈ అమ్మాయి గోడును.. దర్శకులు పట్టించుకుంటారా ? కనీసం ప్రేక్షకుల్లో అణువంతైనా మార్పొస్తుందా ? దీనికి కమర్షియల్ కాన్సెప్ట్ నుంచి తెలుగు సినిమా బైటపడ్డప్పుడే అనే సమాధానం వస్తుందేమో !