Begin typing your search above and press return to search.

బాహుబలిలోకి తెలుగమ్మాయి ఎంట్రీ

By:  Tupaki Desk   |   21 Oct 2016 4:59 AM GMT
బాహుబలిలోకి తెలుగమ్మాయి ఎంట్రీ
X
బాహుబలి మూవీలో ముగ్గురు లేడీస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివగామిగా రమ్యకృష్ణ.. దేవసేనగా అనుష్క.. అవంతికగా తమన్నాలు నటిస్తున్నారు. వీళ్లంతా తెలుగు సినిమాల్లో సత్తా చాటిన ప్రముఖ హీరోయిన్స్ అయినా.. ఎవరూ తెలుగోళ్లు మాత్రం కాదు. రమ్యకృష్ణ-తమిళనాడు.. స్వీటీ-కర్నాటక.. తమన్నా-మహరాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు బాహుబలిలో ఓ తెలుగమ్మాయికి స్థానం దక్కింది. ఆమె ఎవరో కాదు.. మోడల్ గా సత్తా చాటుతున్న ప్రియా నాయుడు.

బాహుబలి2లో ఓ సపోర్టింగ్ రోల్ కోసం ప్రియా నాయుడును తీసుకున్నారు. రీసెంట్ గా ఆడిషన్ పూర్తి చేసుకుని.. సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసింది ప్రియ. 'నా కజిన్ సిద్ధార్ధ్ నా పోర్ట్ ఫోలియో చూపిస్తే.. ఆడిషన్ కి రమ్మన్నారు. తర్వాత రోజు నుంచే షూటింగ్ కి వచ్చేయమన్నారు. నా తొలిసినిమా రాజమౌళిలాంటి దర్శకుడితో చేస్తుండడంతో.. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా' అంటోంది ప్రియా నాయుడు.

బాహుబలితో పాటు ఈ భామకు మరిన్ని ఆఫర్స్ కూడా వచ్చాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న నక్షత్రంలో కూడా ఛాన్స్ వచ్చింది. బాహుబలి2లో పెద్ద స్టార్లతో సమానంగా చూస్తున్నారని.. ఇక నక్షత్రం సెట్స్ లో అయితే జూనియర్ ఆర్టిస్టులను కూడా కృష్ణవంశీ గౌరవంగా చూస్తారని చెబుతోంది బోలెడంత ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతోన్న ప్రియా ఆనంద్. శ్రీనివాస్ అవసరాల హీరోగా నటించనున్న హంటర్ లో కూడా ఈమెకు కీలక రోల్ ఆఫర్ చేశాడు దర్శకుడు నవీన్ మేడారం.