తెలుగమ్మాయి ఐతే బికినీ వేసుకోకూడదా?

Sun Jan 20 2019 15:44:36 GMT+0530 (IST)

టాలీవుడ్ లో గత రెండు మూడు దశాబ్దాల కాలంగా తెలుగమ్మాయిలు స్టార్ హీరోయిన్స్ గా ఎదగలేక పోయారు ఇంకా కూడా తెలుగమ్మాయిలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో సెకండ్ హీరోయిన్ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ఇతర ఇండస్ట్రీల్లో తెలుగమ్మాయిలు రాణిస్తున్నా కూడా టాలీవుడ్ లో మాత్రం మన అమ్మాయిలు అంతగా రాణించలేక పోతున్నారు. ఎందుకంటే తెలుగమ్మాయిలు మోడ్రన్ డ్రస్ లు వేసుకున్నా అందాల ప్రదర్శణ చేసినా కూడా వెంటనే మనలోని కొందరే తెలుగమ్మాయి అయ్యి ఉండి మరీ ఇంత బరితెగింపా అంటారు.తాజాగా అదే సంఘటన మిస్ ఇండియా శోభిత దూళిపాలకు ఎదురైంది. ఆమద్య తెలుగులో 'గూఢచారి' చిత్రంలో నటించి మెప్పించిన ఈమె బాలీవుడ్ వైపు చూస్తుంది. ఇంటర్నెషనల్ వెబ్ సిరీస్ లలో ఇప్పటికే నటిస్తు నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్న ఈమె బాలీవుడ్ సినిమాలకు సూట్ అయ్యేలా కాస్ట్యూమ్స్ ధరిస్తూ గ్లామర్ గా కనిపిస్తూ వస్తుంది. తాజాగా ఈమె సముద్రంలో బికినీ వేసుకుని తీసుకున్న ఫొటలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

తెలుగమ్మాయి అయ్యిండి మరీ ఇలాంటి ఫొటోలు పోస్ట్ చేయడం ఏంటని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఎంత స్టార్ అయినా కూడా నువ్వు తెలుగమ్మాయివి అనే విషయాన్ని మర్చి పోవద్దని సూచిస్తున్నారు. శోభితపై వస్తున్న విమర్శలను కొందరు తప్పుబడుతున్నారు. తెలుగమ్మాయి అయితే మాత్రం ప్రతిభను దాచుకోవాలా ఎంతో మంది స్టార్స్ గ్లామర్ ఫొటో షూట్స్ ఇస్తూ ఉంటారు. వారందరిపై తప్పుపట్టని వారు తెలుగమ్మాయి బికినీ వేయగానే ఎందుకో నోరు లేస్తుంది. ఇలాంటి వారు ఉన్నందు వల్లే టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు రాణించలేక పోతున్నారనేది కొందరి వాదన.