Begin typing your search above and press return to search.

ఇక స్టార్ హీరోయిన్స్ వాళ్లే

By:  Tupaki Desk   |   21 Feb 2018 11:30 PM GMT
ఇక స్టార్ హీరోయిన్స్ వాళ్లే
X
సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్ల హ‌వా సాగేది కొన్నాళ్లే. హీరోలు మాత్రం ఏళ్ల‌కు ఏళ్లు పాతుకుపోతారు. హీరోయిన్లు రెండు మూడేళ్లు సినీ పరిశ్ర‌మ‌ను ఏలేసి... క‌నుమ‌రుగైపోతుంటారు. కొత్త నీరొచ్చి పాత‌నీరును తోసేసిన‌ట్టు... కొత్త హీరోయిన్లు వ‌చ్చి పాత హీరోయిన్ల‌కు ఎస‌రు పెడుతుంటారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ల జాబితా కూడా మారిపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

2009-2010 కాలంలో కాజల్ అండ్ సమంత ఎంట్రీ ఇచ్చారు. అప్ప‌టికీ టాలీవుడ్ ఏలేస్తున్న శ్రియ‌ - త్రిష‌ల‌కు టెండ‌ర్ పెట్టారు. నెమ్మ‌దిగా వారి అవ‌కాశాల్ని వీరు అందుకున్నారు. దాంతో శ్రియ‌ - త్రిష‌ - ఇలియానాలు బ్యాగులు స‌ర్దేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌ధ్య మ‌ధ్య‌లో త‌మ‌న్న కూడా మెరుపులు మెరిపించింది. గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాతో శ్రుతి హాస‌న్ భారీ హిట్ కొట్టి... కొన్నాళ్ల పాటూ అంద‌రు హీరోల సినిమాల‌లోనూ ఆమెనే క‌నిపించింది. అంద‌రినీ తొక్కేసింది. కానీ ఎక్కువ కాలం ఆమె హ‌వా కొన‌సాగ‌లేదు. ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ ఇచ్చి... అప్ప‌టికి స్టార్ హీరోయిన్లుగా ఉన్న కాజ‌ల్‌ - త‌మ‌న్నా - శ్రుతి హాస‌న్ ల‌కు చుక్క‌లు చూపించింది. తానే స్టార్ హీరోయిన్‌ గా మారింది. ఇప్పుడు ఆమె కాలం కూడా ముగిసిపోయింది.

ఇప్పుడు టాలీవుడ్లో కాస్త ఊపు మీద ఉన్న హీరోయిన్లు... కీర్తి సురేష్‌ - అను ఇమ్యాన్యుయెల్‌ - రాశి ఖ‌న్నా - సాయి ప‌ల్ల‌వి - పూజా హెగ్డే... వీరికే ఇప్పుడు అవ‌కాశాల‌న్నీ త‌లుపు త‌డుతున్నాయి. వీరే ఇప్పుడు టాప్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకుంటున్నారు. అందులో పూజా హెగ్డే బన్నీతో చేశాక మహేష్‌ అండ్ ఎన్టీఆర్ తో ఛాన్సులు కొట్టేయడం.. ఆమెను మరో ఇలియానా తరహాలో వర్ణిస్తున్నారు జనాలు. ఇక స‌మంత‌ - అనుష్క‌... సీనియ‌ర్ హీరోయిన్లు అయిపోయారు. అనుష్క పెద్ద హీరోల‌తో త‌ప్ప చిన్న హీరోల‌తో చేసే ప‌రిస్థితి లేదు. ఇక స‌మంత... త‌న‌దైన శైలిలో సినిమాలు ఒప్పుకుంటూ పోతోంది. అక్కినేని వారి ఇంటి కోడ‌లు క‌నుక... అవ‌కాశాలు వ‌స్తూనే ఉంటాయంటున్నారు సినీ జ‌నాలు.