Begin typing your search above and press return to search.

సారీ అల్లు అనేసారా

By:  Tupaki Desk   |   24 April 2018 7:42 AM GMT
సారీ అల్లు అనేసారా
X
అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. శ్రీరెడ్డి కాంట్రోవర్సీ మొదలుకుని ఇటీవలే వర్మ మూలంగా పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషించడం దాకా పలు అంశాల గురించి ఇండస్ట్రీ పెద్దలు జరిపిన సమావేశంలో అల్లు అరవింద్ చేసిన ఒక ప్రతిపాదనకు అందరు ముక్తకంఠంతో నో చెప్పారు అనే టాక్ ఇప్పుడు జోరుగా సాగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ మొత్తం ఉదంతంలో బాగా ఓవర్ యాక్షన్ చేసిన మూడు న్యూస్ ఛానల్స్ ను పరిశ్రమ నుంచి బహిష్కరించాలన్న ప్రపోజల్ ను అల్లు అరవింద్ నిర్మాతల ముందు ఉంచగా దాన్ని తిరస్కరించినట్టు వస్తున్న వార్త సంచలనం రేపుతోంది. దీనికి బదులుగా రివర్స్ లో అల్లు అరవిందే డిఫెన్స్ లో పడేలా కొందరు లేవనెత్తిన అంశాలు ఆయన ఊహించినవి కాకపోవడంతో మౌనాన్ని ఆశ్రయించినట్టు తెలిసింది.

కాస్టింగ్ కౌచ్ వివాదం ప్రారంభమైన తొలినాళ్ళలో ఒక న్యూస్ ఛానల్ యాంకర్ ఇండస్ట్రీలో మహిళల గురించి చాలా నీచమైన కామెంట్ చేసినప్పుడు పరిశ్రమలో వివిధ వర్గాల నుంచి ప్రతినిధులు హాజరై మీడియాసమావేశం ఏర్పాటు చేసి మరీ నిరసన ప్రకటించారు. ఆ మీటింగ్ కు మెగా హీరోలు ఎవరూ రాలేదు. దాని గురించి అల్లు అరవింద్ ని నిలదీసినట్టు టాక్. ఇప్పుడు మీ దాకా వచ్చింది కాబట్టి మీ కోసమే న్యూస్ ఛానల్స్ ని బ్యాన్ చేయటం ఎలా కుదురుతుందని అడిగినట్టు వినికిడి. దానికి తోడు పవన్ కళ్యాణ్ ని శ్రీరెడ్డి దూషించడానికి ముందు చాలా పేరున్న టాలీవుడ్ దర్శకులను - రచయితలను టార్గెట్ చేసి అవే న్యూస్ ఛానల్స్ లో నానా రచ్చ చేసినప్పుడు ఎవరు మాట్లాడలేదు కాని ఇప్పుడు పవన్ ను అనగానే బ్యాన్ చేయాలనీ చెప్పడం సబబు కాదని అభిప్రాయపడినట్టు తెలిసింది.

ఇది నిజమని నిర్ధారించే ఆధారాలు లేవు కాని గత రెండు రోజులుగా ఇండస్ట్రీ లో మీడియా ప్రమేయం లేకుండా కొన్ని సమావేశాలు అయితే జరిగాయి. ఇది ఇంకా ముదరకుండా టాలీవుడ్ పరువు జాతీయ మీడియా దృష్టిలో పడక ముందే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని గురించి రెండు మూడు దఫాలలో పరిశ్రమ పెద్దలు కలుసుకున్నట్టు ఇప్పటికే ప్రచారంలో ఉంది. మరి ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.