Begin typing your search above and press return to search.

ఆర్టిస్టుల‌కు సీన్ ఎలా ఉంది?

By:  Tupaki Desk   |   9 Dec 2018 3:30 PM GMT
ఆర్టిస్టుల‌కు సీన్ ఎలా ఉంది?
X
ప్ర‌స్తుతం టాలీవుడ్‌ కి స‌రిప‌డినంత మంది ఆర్టిస్టులు ఉన్నారా? సినిమా-టీవీ - డిజిట‌ల్ విస్త్ర‌తి అంతకంత‌కు పెరుగుతున్న వేళ త‌లెత్తిన ప్ర‌శ్న ఇది. ఇంత‌కుముందుతో పోలిస్తే ఆర్టిస్టులు పెరుగుతున్నారు కానీ విష‌యం ఉన్న ఆర్టిస్టుల కొర‌త వేధిస్తోంద‌న్న‌ది ఓ స‌ర్వే చెబుతోందిట‌. ఆ మేర‌కు ఓ సీనియ‌ర్ ఆర్టిస్టు అందించిన వివ‌రాల ప్ర‌కారం..

ప్ర‌స్తుతం బుల్లితెర‌తో పాటు వెండితెర‌పైనా అవకాశాలు పెరిగాయే కానీ త‌గ్గ‌లేదు. అలాగే టీవీ షోలు - యూట్యూబ్‌ - డిజిట‌ల్ స్ట్రీమింగ్ రాక‌తో ఆర్టిస్టుల‌కు డిమాండ్ మ‌రింత ఊపందుకుంది. న‌వ‌త‌రంలో ప్ర‌తిభావంతుల‌కు ఇది ఎంతో గొప్ప అవ‌కాశాలిస్తోంద‌ని అన్నారు. అంతేకాదు.. న‌టీన‌టులు ఎవ‌రైనా క్లిక్క‌యితే ఇక్క‌డ తిరుగే ఉండ‌దు. పారితోషికాల‌తో పాటు, గౌర‌వం అంతే ఎక్కువ‌గా ఉంటుందని తెలిపారు. జ‌బ‌ర్ధ‌స్త్ లాంటి షోతో పాపుల‌రై కోట్ల‌లో ఆర్జించిన వారున్నార‌ని విశ్లేషిస్తున్నారు మ‌రికొంద‌రు.

వెబ్ సిరీస్‌ లు.. డిజిట‌ల్ సిరీస్‌ లు - యూట్యూబ్ అంటూ ప్ర‌స్తుతం టాలీవుడ్‌ లో మోతెక్కిపోతోంది.. అన్నీ ఆఫ‌ర్లే.. ప్ర‌తి రోజూ దేశంలో ఏదో ఒక మూల‌ ఓ వెబ్ సిరీస్ ప్రారంభ‌మ‌వుతోంది. అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి. టాలీవుడ్‌ లోనూ వెబ్ సిరీస్‌ లు - ల‌ఘు చిత్రాల‌ వెల్లువ మామూలుగా లేదు. అందుకే ఇప్పుడు క‌ళాకారుల‌కు ఎల్ల‌లు లేవు. పైగా క్లిక్క‌యిన ఆర్టిస్టుకి భాష‌తో ప‌ని లేదు.. అందుకే న‌ట‌న దిన‌దిన‌ప్ర‌వ‌ర్థ‌మానంగా పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. ఇక్క‌డ అవ‌కాశాలు కొద‌వేం లేదు. అయితే నిరూపించుకున్న వాళ్ల‌కు నిరూపించుకున్నంత ఆఫ‌ర్లు ఉంటాయి. ఫిలింన‌గ‌ర్‌ - కృష్ణాన‌గ‌ర్‌ - న‌డిగ‌ర‌సంఘం స‌హా ర‌క‌ర‌కాల‌ ఆర్టిస్టుల వాట్సాప్‌ గ్రూప్‌ లో .. కొన్ని టీవీ మూవీ ఆర్టిస్టుల వాట్సాప్ గ్రూపుల్లో అన్నీ వెబ్ సిరీస్‌ ల‌కు - ల‌ఘు చిత్రాల‌కు సంబంధించిన కాస్టింగ్ కాల్ ఆఫ‌ర్స్ గురించి ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డుతున్నాయి. దీంతో పాటే అక్క‌డ నిరూపించుకుంటే పెద్ద తెర‌, బుల్లితెర‌ ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయ‌ని ఈ రంగంలో 15ఏళ్లుగా ఉన్న‌ ఓ సీనియ‌ర్ ఆర్టిస్టు వెల్ల‌డించారు. ఆరంభం క‌ష్టాలుంటాయ్‌.. క‌న్నీళ్లుంటాయి.. అవ‌మానాలుంటాయి.. క్లిక్క‌య్యాక అవ‌న్నీ తుడిచిపెట్టుకుపోతాయి. స్టార్లుగా మీసం మెలేయొచ్చు.. అని చెప్పారు. మ‌రింకేం.. ట్యాలెంటే ప‌ర‌మావ‌ధి. నిజాయితీగా ప్ర‌య‌త్నించండి... ఆర్టిస్టులుగా ఎద‌గండి.