Begin typing your search above and press return to search.

ఫ్రైడే క్లాష్: పోటీ గట్టిగానే ఉంది

By:  Tupaki Desk   |   21 March 2018 11:06 AM GMT
ఫ్రైడే క్లాష్: పోటీ గట్టిగానే ఉంది
X
థియేటర్ల సమ్మె పూర్తయ్యాక సినిమాల సందడి గత వారం కిరాక్ పార్టీతో మొదలై ఇక నుంచి బ్రేకులు లేకుండా సమ్మర్ సీజన్ దాకా అలా అలా సాగిపోనుంది. ఇక ఈ వారం విషయానికి వస్తే పోటీలో ఉన్న సినిమాలు అన్నింటిలోకి ఎక్కువ అటెన్షన్ తీసుకుంటున్న మూవీ ఎమెల్యే. కళ్యాణ్ రామ్ సోలో హీరోగా సినిమా వచ్చి కొంత కాలమైనా దీని మీద మంచి అంచనాలే ఉన్నాయి. పోస్టర్లు - ట్రైలర్ అన్ని విషయమున్నట్టుగానే కనిపించడంతో ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మాస్ ని మెప్పించే సినిమా ఈ ఏడాదిలో కొంతలో కొంత ఓకే అనిపించిన జైసింహ తప్ప మరొకటి ఇప్పటి దాకా రాలేదు. ఆ కొరతను ఎమెల్యే తీరుస్తుందనే అంచనాలో ఫాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఉపేంద్ర మాధవ్ డెబ్యు మూవీగా వస్తున్న ఈ మూవీలో పన్నెండేళ్ళ తర్వాత కాజల్ తన మొదటి సినిమా లక్ష్మి కళ్యాణం హీరో కళ్యాణ్ రామ్ తో జట్టు కట్టింది.

ఇక శ్రీవిష్ణు హీరోగా వేణు ఊడుగుల అనే కొత్త దర్శకుడు రూపొందించిన నీది నాది ఒక కథకు భీభత్సమైన హైప్ లేదు కాని సోషల్ మీడియాలో మాత్రం మంచి ప్రీ రిలీజ్ టాక్ రన్ అవుతోంది. అంచనాలు ఆశల మధ్య నలిగిపోయే సగటు మధ్యతరగతి యువకుడి జీవితాన్ని కథగా తీసుకోవడంతో యూత్ బాగానే కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. కంటెంట్ ఉంటే మాత్రం నిలవడం కష్టమేమి కాదు. బిచ్చగాడు ఫేం సాత్నా టైటస్ హీరొయిన్ గా నటించిన స్ట్రెయిట్ తెలుగు మూవీ కూడా ఇదే. డాగ్మీ 95 పద్దతిలో తీసిన తొలి తెలుగు సినిమాగా కూడా నీది నాది ఒకే కథ ప్రత్యేకత సంతరించుకుంది. ఇక రాజరధం మీద భారీ అంచనాలు లేవు కాని వెరైటీ కాన్సెప్ట్ ఏదో ఉన్నట్టు మాత్రం అర్థమవుతోంది. అందరు కన్నడ నటీనటులు ఎక్కువగా ఉన్న ఈ మూవీలో రానా ఒక వాహనం పాత్ర పోషించడం ప్రత్యేకత. రాజరధం అంటే రానానే. దీనికి ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు విడుదల వాయిదా పడ్డ రాజరధం సర్ ప్రైజ్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.

ఇవి కాకుండా అనగనగా ఒక ఊళ్ళో అనే చిన్న సినిమా కూడా పోటీలో ఉంది. కెవి సాయి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ పై యూనిట్ నమ్మకంగా ఉంది. మలయాళం డబ్బింగ్ ఆనందం కూడా ఇదే రోజు రానుంది. హ్యాపీ డేస్ తరహాలో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీ అక్కడ పెద్ద హిట్. ఇక్కడ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. ఇవి కాకుండా వరుణ్ సందేశ్ - వేదా నటించిన మర్లపులి అనే మరో సినిమా కూడా లైన్ లో ఉంది. ఇది కూడా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సినిమానే. ఒక పెద్ద సినిమాతో నాలుగు చిన్న సినిమాలు పోటీ పడుతున్న ఈ శుక్రవారం బరిలో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాలి