Begin typing your search above and press return to search.

టికెట్ కౌంటర్: సంక్రాంతికి పండగే పండగ

By:  Tupaki Desk   |   16 Jan 2017 6:22 PM GMT
టికెట్ కౌంటర్: సంక్రాంతికి పండగే పండగ
X
ఈ సంక్రాంతికి టాలీవుడ్ కి ధమాకా అని చెప్పాల్సిందే. గతేడాది మాదిరగిగానే ఈ సారి కూడా గట్టిపోటీనే ఉన్నా.. దాదాపు అన్ని సినిమాలు కలెక్షన్స్ కుమ్మేయడం విశేషం.

1. ఖైదీ నంబర్ 150: మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీకి బాక్సాఫీస్ దగ్గర కనకవర్షం కురిపించేస్తోంది. ఏరియాలతో సంబంధం లేకుండా రికార్డులన్నీ బద్దలైపోతున్నాయి. తొలిరోజు వసూళ్లలో బాహుబలిని కూడా దాటేసింది చిరంజీవి మూవీ. తొలి వీకెండ్ ముగిసేనాటికే ప్రపంచవ్యాప్తంగా 67.25 కోట్లకు పైగా షేర్ వచ్చేసిందంటే.. (97 కోట్ల గ్రాస్ వచ్చేసిందిలే) మెగాస్టార్ కి ఏ రేంజ్ లో టాలీవుడ్ లు ప్రేక్షకులు తిరిగి ఆహ్వానం పలికారో అర్ధమవుతుంది. ఓవర్సీస్ లో ఇప్పటికే 2 మిలియన్ డాలర్లు వసూలు చేసి.. టాప్4కి చేరిపోయింది ఖైదీ నంబర్ 150.

2. గౌతమిపుత్ర శాతకర్ణి: పోటీ మధ్య విడదులైనా.. డీసెంట్ టాక్ తో దూసుకుపోతోంది బాలకృష్ణ మూవీ. చారిత్రక చిత్రానికి అన్ని ఏరియాల్లోనూ మంచి ఆదరణ దక్కుతోంది. బాలయ్య కెరీర్ బెస్ట్ మూవీగా ఇప్పటికే స్థానం సంపాదించేసుకోగా.. ఓవర్సీస్ లో కలెక్షన్స్ స్టడీగా ఉండడం విశేషం. దాదాపు 32.22 కోట్ల షేర్ ఇప్పటికే రావడంతో లాంగ్ రన్ ఉండే మూవీగా గౌతమిపుత్ర శాతకర్ణిని ట్రేడ్ జనాలు అంచనా వేస్తున్నారు.

3. శతమానం భవతి: శర్వానంద్ మూవీ శతమానం భవతి కూడా తొలిరోజు నుంచి మంచి వసూళ్లు రాబడుతోంది. శర్వానంద్ ట్రాక్ రికార్డ్ దీనికి హెల్ప్ అయింది. దీంతో పాటు మంచి కుటుంబ కథా చిత్రం అన్న టాక్ బాగా ప్లస్ పాయింట్ అయింది.

4. ట్రిపుల్ ఎక్స్-ది రిటర్న్ ఆఫ్ ది క్సాండర్ కేజ్: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే నటించిన ఈ హాలీవుడ్ మూవీ.. ఓవర్సీస్ కంటే ముందే మన దగ్గర రిలీజ్ అయింది. అయితే.. టాక్ మాత్రం నిరుత్సాహకరంగా ఉండడంతో.. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టడంలో విఫలమైంది.

5. కానిస్టేబుల్ వెంకట్రామయ్య: సంక్రాంతికి పెద్ద సినిమాలు వస్తున్నా సరే పంతం కొద్దీ తన సినిమాను రిలీజ్ చేశారు ఆర్. నారాయణ మూర్తి. కంటెంట్ ఎలా ఉందన్న సంగతి కంటే.. తగినన్ని థియేటర్లు కూడా ఈ మూవీకి లభించలేదు. రిలీజ్ అయిన ఆ కొన్ని చోట్ల కూడా టాక్.. కలెక్షన్స్ ఏదీ ఆశాజనకంగా లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/