Begin typing your search above and press return to search.

టికెట్ కౌంటర్: అలా అలా సాగుతోంది

By:  Tupaki Desk   |   2 Jan 2017 5:30 AM GMT
టికెట్ కౌంటర్: అలా అలా సాగుతోంది
X
ఏడాది చివరి వారం కూడా కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో ఏదీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో.. బాక్సాఫీస్ కళకళలాడలేకపోయింది. ఇక బాగుందనే టాక్ తెచ్చుకున్న అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకు ధియేటర్లు లేవు.

1. దంగల్: గతవారం రిలీజ్ అయిన ఈ బాలీవుడ్ మూవీ.. ఇంకా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. 2016కే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ ఆమిర్ ఖాన్ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. అటు మల్టీప్లెక్సులు.. ఇటు సింగిల్ స్క్రీన్స్ లో కూడా దంగల్ సత్తా చాటుతుండడం విశేషం.

2. ఇంట్లో దెయ్యం నాకేం భయం: అల్లరి నరేష్ కెరీర్ గాడిలో పెడుతుందని అనుకున్న ఈ చిత్రం.. రెగ్యులర్ హారర్ కామెడీల్లో ఒకటి అనిపించుకుందంతే. కొత్త సన్నివేశాలేవీ లేకపోవడం ఆడియన్స్ ను నిరుత్సాహపరిచింది. అయితే.. వీకెండ్స్ లో మాత్రం చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చాయి. కానీ మౌత్ టాక్ బాగోకపోవడంతో.. వీక్ డేస్ పరిస్థితి ఎలా ఉంటుందో అంటున్నారు ట్రేడ్ జనాలు.

3. ధృవ: రామ్ చరణ్ మూవీ ధృవ వసూళ్లు ఇంకా నిలకడగానే ఉన్నాయి. కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. చెర్రీ మూవీ కలెక్షన్స్ పై ప్రభావం చూపలేకపోయాయి. వీకెండ్స్ లో మంచి వసూళ్లు వస్తుండడంతో బ్రేక్ఈవెన్ స్థాయికి వచ్చేసింది. అటు ఓవర్సీస్ లో ధృవ 1.5 మిలియన్ డాలర్ల మార్కుకు చేరువైంది.

4. అప్పట్లో ఒకడుండేవాడు:నారా రోహిత్ నటించిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అయితే.. తక్కువ థియేటర్లలో రిలీజ్ కావడం ఈ చిత్రానికి బ్యాడ్ అనాలి. మౌత్ టాక్ బాగుండడంతో.. ఇప్పుడీ మూవీకి స్క్రీన్స్ పెంచుతున్నారు. ఇంకా పికప్ అయ్యే అవకాశాలు అప్పట్లో ఒకడుండేవాడు చిత్రానికి పుష్కలంగా ఉన్నాయి.

5. సప్తగిరి ఎక్స్ ప్రెస్: కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి అయితే విమర్శలు వచ్చాయి కానీ.. బీ సీ సెంటర్స్ లో వసూళ్లు బాగానే వస్తున్నాయి. వీకెండ్స్ లో వసూళ్లు బాగుండడంతో.. సప్తగిరి ఎక్స్ ప్రెస్ మరీ పరుగులు పెట్టకపోయినా.. మెల్లగా అయినా నడుస్తుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/