Begin typing your search above and press return to search.

టికెట్ కౌంటర్: ఈ వీకెండ్ కూడా చిన్నవాడిదే

By:  Tupaki Desk   |   28 Nov 2016 9:23 AM GMT
టికెట్ కౌంటర్: ఈ వీకెండ్ కూడా చిన్నవాడిదే
X
డిమానిటైజేషన్ దెబ్బకి డీలా పడ్డ టాలీవుడ్ కి.. చిన్నవాడు ఇచ్చిన జోష్ బాగానే వర్కవుట్ అయింది. కాస్త జనాల చేతుల్లో కూడా డబ్బులు ఆడ్డంతో.. థియేటర్లు కళకళలాడ్డం కనిపించింది.

1.ఎక్కడికిపోతావు చిన్నవాడా: నిఖిల్ నటించిన ఈ సూపర్ నేచరుల్ థ్రిల్లర్ మూవీ.. టికెట్ కౌంటర్ల దగ్గర బాగా ఫేర్ చేస్తోంది. రెండు కొత్త సినిమాలు వచ్చినా సరే రెండో వీకెండ్ లో కూడా టాప్ స్లాట్ ను దక్కించుకుందంటే.. ఆడియన్స్ నుంచి ఏ రేంజ్ లో సపోర్ట్ వస్తోందో అర్ధమవుతుంది. వీకెండ్స్ లో సిటీస్ వరకూ హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఇప్పటికే బయ్యర్లు.. డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వచ్చేయగా.. మరిన్ని లాభాలు అందుకోవడం ఖాయంగా చెప్పచ్చు.

2. జయమ్ము నిశ్చయమ్మురా: కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ఈ మూవీ.. ఆరంభం అంత ప్రోత్సాహకరంగా లేదు. టాక్ బాగానే ఉన్నా.. టికెట్ కౌంటర్ల దగ్గర యావరేజ్ షో మాత్రమే నడుస్తోంది. మెల్లగా పికప్ అయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ టాక్.

3. రెమో: శివకార్తికేయన్- కీర్తిసురేష్ లు నటించిన ఈ డబ్బింగ్ బొమ్మకి ఫస్ట్ వీకెండ్ బాగానే నడించింది. కలెక్షన్స్ మెల్లగా పెరగడం చెప్పుకోవాల్సిన విషయమే. ఎటువంటి ట్విస్టులు లేని ఫ్లాట్ స్క్రీన్ ప్లే ఒక్కటే ఈ మూవీకి మైనస్ పాయింట్.

4. డియర్ జిందగీ: ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించగా.. షారూక్ ఖాన్ కీలక రోల్ చేసిన ఈ చిత్రానికి.. వీకెండ్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ రోజు యావరేజ్ గా ఉన్నా.. ఆ తర్వాత కలెక్షన్స్ పికప్ కావడం చెప్పుకోవాల్సిన విషయం. వీక్ డేస్ లో కూడా సిటీల్లో డియర్ జిందగీకి వసూళ్లు బాగానే రావచ్చంటున్నారు ట్రేడ్ జనాలు.

5. సాహసం శ్వాసగా సాగిపో: కరెన్సీ నోట్ల రద్దు ఎఫెక్ట్ తో మొదట బాగా దెబ్బ తినడంతో.. ఆ తర్వాత వసూళ్లు పుంజుకుంటాయన్న సాహసం నిర్మాతల ఆశలు నెరవేరలేదు. అందరికీ చిన్నవాడి పైనే దృష్టి ఉండడంతో.. చైతు బెస్ట్ ఎవర్ పెర్ఫామెన్స్, ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్.. గౌతమ్ మీనన్ అందించిన విజువల్ వండర్స్.. దాదాపు వృథా అయిపోయినట్లే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/