మనమే చాలా బెటరండీ బాబూ

Thu May 17 2018 21:00:01 GMT+0530 (IST)

‘బిగ్ బాస్’ తెలుగు హ్యాయెస్ట్ టీఆర్పీ అందుకున్న టీవీ ప్రోగ్రామ్ గా రికార్డు సృష్టించి... మా టీవీకి మళ్లీ పూర్వ వైభవం తెచ్చిన కార్యక్రమం. హోస్టుగా యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ షోను నడిపించిన తీరు... అన్ని వర్గాల వారికీ ఆయన్ని చేరువ చేసింది. అయితే హిందీ- తమిళ్- మరాఠీ ఇలా చాలాభాషల్లోనే వచ్చిందీ కార్యక్రమం. కానీ అన్నింటిలోకీ మనదే కాస్త నయమనే చెప్పాలి.ఎందుకంటే... సల్మాన్ ఖాన్ నడిపించిన హిందీ బిగ్ బాస్ చూస్తే మనవాళ్ల మతులు పోవడం గ్యారెంటీ. పార్టిసిపెంట్ల అర్థ నగ్న దృశ్యాలు- సరసాలు- ఘాటైన ముద్దు సన్నివేశాలు- అంతకు మించి అనిపించే కతలెన్నో కనిపిస్తాయి. బాలీవుడ్ జనాలకు సీరియల్స్ లోనే ఇలాంటి సీన్స్ ఉండడం కామన్ కాబట్టి సరిపోయింది కానీ మన విషయంలో అలా కాదు. యూనివర్సల్ స్టార్ హోస్ట్ చేసిన తమిళ్ బిగ్ బాస్ కథ కూడా ఇంచు మించు ఇలాంటిదే. అక్కడ కూడా టీఆర్పీ పడిపోవడంతో కావల్సినంత మసాలా యాడ్ చేశారు. హీరోయిన్ ఒవియా అయితే సూసైడ్ చేసుకునేందుకు స్విమ్మింగ్ ఫూల్ లో దూకేసింది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ లోకి పోలీసులు వెళ్లేదాక వెళ్లింది అరవ బిగ్ బాస్ కథ.

ఇప్పుడు తాజాగా మరాఠీలోనూ బిగ్ బాస్ సీజన్ స్టార్ చేశారు. బాలీవుడ్ జనాల కంటే మేమేం తక్కువ తిన్నామా... అన్నట్టు ఇందులోనూ లిప్ లాక్ సీన్స్ చాలానే ఉన్నాయి. జంటలుగా మారిన పార్టిసిపెంట్ల మధ్య వచ్చే సరస సన్నివేశాలు- ఘాటైన ముద్దులను సెన్సార్ లేకుండానే ప్రసారం చేస్తున్నారు. దాంతో యువత బాగానే ఆకర్షితులవుతున్నారు దీనికి.

వీటన్నింటితో పోలిస్తే  మన బిగ్ బాస్ లో అసభ్య సన్నివేశాలు కానీ... గాఢ చుంబన దృశ్యాలు కానీ చూపించలేదు. హీరోయిన్ అర్చన- దీక్షా పంత్ చిట్టిపొట్టి డ్రెస్సుల్లో చేసిన చిలిపి సందడి తప్పితే... సరసాలు గానీ ముద్దులు గానీ క్లీన్ యూ సర్టిఫికెట్ పొందింది తెలుగు బిగ్ బాస్. మరి నాచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తాడనే వార్తలు వినిపిస్తున్న వచ్చే సీజన్ ఎలా ఉంటుందో చూడాలి.