Begin typing your search above and press return to search.

టీవీ న‌టుడు కార్లో రేప్ చేశాడ‌ట‌

By:  Tupaki Desk   |   25 Nov 2015 3:38 PM GMT
టీవీ న‌టుడు కార్లో రేప్ చేశాడ‌ట‌
X
హిందీ సీరియ‌ల్ న‌టుడు య‌శ్ పండిట్ రేప్ కేసులో ఇరుక్కున్నాడు. ఐతే ఇది మామూలు రేప్ కేసు కాదు. కొంచెం భిన్న‌మైంది. అత‌ను బ‌ల‌వంతంగా ఓ అమ్మాయిపై అఘాయిత్యం చేయ‌లేదు. ఆ అమ్మాయి కూడా అత‌డితో శృంగారానికి ఒప్పుకుంది. ఐతే య‌శ్ పెళ్లి చేసుకుంటాన‌ని మభ్య‌పెట్ట‌డంతో శృంగారానికి ఒప్పుకున్నాడ‌ని.. త‌ర్వాత త‌న అవ‌స‌రాలు తీర్చుకుని వ‌దిలేశాడ‌ని అంటోంది. య‌శ్ తో క‌లిసి ఓ సీరియ‌ల్లో న‌టిస్తుండ‌గా ఆ అమ్మాయికి అత‌డితో ప‌రిచ‌య‌మైంద‌ట‌. కొన్నాళ్ల త‌ర్వాత త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని య‌శ్ చెప్పాడ‌ని... త‌న‌ను శారీర‌కంగా అనుభ‌వించాడ‌ని ఆమె చెబుతోంది.

మొదట య‌శ్ కారులో త‌న‌పై అసహజ రీతిలో అత్యాచారానికి పాల్పడ్డాడని. ఆ తర్వాత తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని ఇంటికి పిలిచి మ‌ళ్లీ త‌న‌ను లైంగికంగా లొంగ‌బ‌రుచుకున్నాడ‌ని బాధితురాలు ఆరోపించింది. ఇలా చాలాసార్లు త‌న‌పై అత్యాచారం జ‌రిపిన య‌శ్‌.. కొన్ని రోజులుగా త‌న ఫోన్ కు కూడా స్పందించ‌డం లేద‌ని పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించి య‌శ్ ముంద‌స్తు బెయిల్ తీసుకున్నాడు. య‌శ్ వేరే అమ్మాయిల్ని కూడా ఇలాగే మోసం చేశాడ‌ని బాధితురాలు అంటోంది.