Begin typing your search above and press return to search.

తెలుగు మహాసభల్లో మహాకవి వార్షికోత్సవం

By:  Tupaki Desk   |   15 Dec 2017 6:08 AM GMT
తెలుగు మహాసభల్లో మహాకవి వార్షికోత్సవం
X
ఎన్నడు ఎవ్వరు జరపని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారి ఘనంగా తెలుగు మహా సభలు జరగబోతున్నాయి. కొన్ని నెలల ముందు నుంచే కేసీఆర్ కార్యక్రమాల గురించి ప్రత్యేక చర్చలు జరిపి అంతా సెట్ చేశారు. అందరికి గుర్తుండిపోయేలా వేడుకలను జరపాలని కేసీఆర్ అధికారులకు సూచనలను ఇచ్చారు. ఇక ఈ రోజు నుంచి వేడుకలు మొదలు కానున్నాయి. తెలుగు బాషా కోసం పాటుపడుతున్న సాహితివేత్తలందరి సమక్షంలో సభను నిర్వహించనున్నారు.

అయితే ఈ వేడుకలో ప్రముఖ కవి చందాల కేశవదాసు జన్మ వార్షికోత్సవాన్ని కూడా తెలంగాణా ప్రభుత్వం అధికారికంగా జరపనుంది. కేశవదాసు మొదటి సారిగా పూర్తి నిడివి గల ఒక తెలుగు సినిమా 'భక్త ప్రహ్లాద'కు పాటలను రాశారు. అందులోని పద్యాలను కూడా ఆయనే రాశారు. 1932లో విడుదలైన ఆ సినిమా ఎంతగటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు జనాలు ఇప్పటికి ఆ సినిమాలోని పాటలను వింటుంటారు.

తరువాత ఈ ఐకానిక్ లిరిసిస్ట్ తెలుగులో అనేక హిట్ సినిమాలకు పాటలు రాశారు. అయన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కుసుమంచి మండల్లోని జక్కేపల్లి గ్రామంలో జన్మించాడు. అయితే అయన మొదటి తెలుగు పాట 'తనయా ఇతులన్ తగదురా పలుకా' రచనకు గాను ఈ కవికి గౌరవం దక్కనుంది. ప్రముఖులు వేడుకలో కేశవదాసు పద్యాలను సినీ సాహిత్య కళా కారులు ప్రధానంగా గుర్తు చేసుకోనున్నారు.