Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఇప్పుడు అఫీషియల్

By:  Tupaki Desk   |   14 Sep 2017 5:04 AM GMT
తెలంగాణలో ఇప్పుడు అఫీషియల్
X
తెలుగు సినిమా జనాలు ఎప్పటి నుంచో కోరుతున్న కోరిక.. ఇప్పటికి సాకారమైంది. కలెక్షన్స్ పెంచుకునేందుకు రేట్లు పెంచేందుకు స్కోప్ పరిమితంగానే ఉంటుంది. దీనికి బదులుగా షోస్ సంఖ్య పెంచుకోవాలని చేసే ప్రయత్నాలు అన్నీ సక్సెస్ కావడం లేదు. మల్టీప్లెక్స్ లలో ఇప్పటికే రోజుకు ఐదారు షోస్ వేస్తున్నా.. సింగిల్ స్క్రీన్స్ లో కూడా ఇలాంటి సౌకర్యం కోసం చాలానే ప్రయత్నాలు చేయాల్సి వచ్చేది.

కొన్ని సినిమాలకు అధికంగా ప్రదర్శనలకు అనుమతులు ఇచ్చి.. కొన్నిటికి ఇవ్వకపోవడం అనే కల్చర్ కనిపించింది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం.. సింగిల్ స్క్రీన్స్ లో రోజుకు 5 షోస్ వేసుకునేందుకు అనుమతి ఇస్తూ జీఓ జారీ చేసేసింది. ఏపీ కూడా ఇదే ఫాలో అయిపోయే అవకాశాలు ఎక్కవగానే ఉన్నాయని ఇండస్ట్రీ జనాల వాదన. ఇది నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్ కు పెద్ద ఊరట అనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పుడు కలెక్షన్స్ ట్రెండ్ అలా ఉంటోంది. సినిమాకు పెట్టిన ఖర్చులో సగం వరకూ తొలి వీకెండ్ లోనే.. మొదటి మూడ్రోజుల్లోనే రాబడితేనే సినిమా సేఫ్ అవుతోంది. రెండో వీకెండ్ నాటికి మిగిలిన డబ్బులు వస్తాయన్న మాట.

అయితే.. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న ఈ స్టెప్ టాలీవుడ్ స్టామినా కూడా పెంచనుంది. ఇప్పటివరకూ 100 కోట్ల క్లబ్ అనేది అందని పండులా కనిపించేది. వాస్తవానికి 100 కోట్ల షేర్ ను మార్క్ ను టచ్ చేయగలిగిన టాలీవుడ్ సినిమాలు మూడే. బాహుబలి సిరీస్ లో రెండు సినిమాలతో ఖైదీ నంబర్ 150 మాత్రమే ఈ స్థాయి వరకూ రాగలిగింది. కానీ ఇప్పుడు రోజుకు 5 షోలకు పర్మిషన్ ఇవ్వడంతో.. ఈ మార్కును అందుకునే పెద్ద సినిమాల కౌంట్ పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.