Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఎన్నికల దేవుడు

By:  Tupaki Desk   |   18 Nov 2018 9:02 AM GMT
ట్రైలర్ టాక్: ఎన్నికల దేవుడు
X
తెలంగాణా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అసలు ఎప్పుడు తీసారో ఎప్పుడు పూర్తయ్యయో కూడా అంతుచిక్కని విధంగా కొత్త సినిమాలు బయటికి వస్తున్నాయి. కెసిఆర్ బయోపిక్ గా ప్రచారంలో ఉన్న తెలంగాణా దేవుడు ఇదే సిరీస్ లో వస్తోంది. శ్రీకాంత్ టైటిల్ రోల్ పోషించగా కెసిఆర్ బాల్యం మొదలుకుని యవ్వనం దాకా రాజకీయ ప్రవేశం నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే దాకా మొత్తం కవర్ చేసినట్టు కనిపిస్తోంది. కాకపోతే హీరో పాత్ర పేరుని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు బదులు విజయ్ దేవ్ అని చెప్పించడం చూస్తే అభ్యంతరరాలు రాకుండా చూసుకునేందుకు ముందు జాగ్రత్తగా అనిపిస్తోంది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఏకంగా 6 నిముషాలు కట్ చేసి నిర్మాతలు కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. మహా అయితే రెండున్నర నిమిషాల కంటే ఎక్కువ టాలీవుడ్ ట్రైలర్ లు ఉండవు. దానికి భిన్నంగా ఇది ఏకంగా షార్ట్ ఫిలిం కన్నా ఎక్కువ లెంత్ తో ఉండటం విశేషం. టేకింగ్ స్టాండర్డ్ తక్కువ స్థాయిలో ఉంది. అయితే సుప్రసిద్ధ సీనియర్ నటులను తీసుకోవడం వల్ల రిచ్ లుక్ వచ్చింది. పోసాని-తనికెళ్ళ భరణి- సుమన్ - అజయ్ - బ్రహ్మానందం - సంగీత ఇలా అందరిని పేరున్న వాళ్లనే తీసుకున్నారు.

కెసిఆర్ టీనేజ్ పాత్రలో చూపించిన యువకుడితో పాటు ఆయన ప్రేయసిగా చూపించిన అమ్మాయి మరీ తీసికట్టుగా ఉన్నారు. యాక్టింగ్ కూడా అదే స్థాయిలో ఉంది. అయితే శ్రీకాంత్ తో సహా సీనియర్ నటులు సిన్సియర్ గా చేయడంతో తెలంగాణా దేవుడు కెసిఆర్ అభిమానులకు టిఆర్ఎస్ మద్దతుదారులకు నచ్చేలా ఉంది. మహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మాణంలో నందన్ రాజు బొబ్బిల్ సంగీతం అందించిన ఈ మూవీతో హరీష్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

వీడియో కోసం క్లిక్ చేయండి