Begin typing your search above and press return to search.

బీచ్‌ లో తేలిపోతున్న ఐస్ క్రీం అందాలు

By:  Tupaki Desk   |   30 Nov 2015 4:35 AM GMT
బీచ్‌ లో తేలిపోతున్న ఐస్ క్రీం అందాలు
X
ఒకోసారి టైం ఎలా కలిసొస్తుందంటే.. నిజంగా గాల్లో తేలిపోవాలని అనిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో సినిమాతో.. తెరంగేట్రం చేసిన తేజస్వి పరిస్థితి ఇప్పుడిదే. ఈ సినిమా వచ్చి నిండా మూడేళ్లు కాడ కాలేదు. కానీ ఈలోపు తేజస్వి ఎడాపెడా 15 సినిమాలు చేసేసింది.

ముఖ్యంగా గతేడాది వచ్చిన ఐస్ క్రీం ఈ చిన్నదాని కెరీర్ కి బిగ్ టర్నింగ్ అని చెప్పుకోవాలి. ఆ తర్వాత చిన్నా పెద్దా అన్ని రకాల పాత్రలు కలిసి వరుసగా చేసేస్తోంది. ఇదే చేయాలనే రూల్ ఏం పెట్టుకోకుండా.. కెరీర్ ని సూపర్ స్పీడ్ లో లాగిచేస్తోంది. ప్రస్తుతం తేజస్వి నటిస్తున్న సినిమాలు 5 సెట్స్ పై ఉన్నాయంటే.. ఈ పిల్లదాని స్పీడ్ అర్ధమవుతుంది. మరి ఇంత బూమ్ లో ఉన్నపుడు ఎవరైనా ఎగిరి గంతేస్తారు కదా. ఇప్పుడు తేజస్వి కూడా అదే చేస్తోంది.

బీచ్ ఒడ్డున గాల్లో ఎగిరిపోతున్న పోజులతో ఓ స్పెషల్ ఫోటోస్ తీయించుకుంది తేజస్వి. తన ట్యాలెంట్ తో పాటు అందాలని కూడా బయటపెట్టే ఆ ఫోటోలని చూస్తే.. ఈ తెలుగు పిల్లలో ఉన్న తెగువ ఏంటో అర్ధమవుతుంది. ఇప్పుడిప్పుడే సోలో హీరోయిన్ పాత్రలను అందుకునే స్థాయికి చేరుకుంటోంది తేజస్వి. త్వరలో జత కలిసే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ తెలుగు అందం.