Begin typing your search above and press return to search.

కుర్రాడితో తెలుగు పిల్ల బై లింగ్యువల్!!

By:  Tupaki Desk   |   22 Jan 2017 5:45 AM GMT
కుర్రాడితో తెలుగు పిల్ల బై లింగ్యువల్!!
X
తెలుగు బ్యూటీ తేజస్వి మదివాడ ఇంకా ఇండస్ట్రీలో గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అటు హీరోయిన్ గాను.. ఇటు ఇంపార్టెన్స్ ఉండే కేరక్టర్స్ లోను యాక్ట్ చేస్తున్న తేజస్వికి.. గ్లామర్ విషయంలో కూడా పెద్దగా పట్టింపులు పెట్టుకోదు

పక్కింటి అమ్మాయి రోల్స్ నుంచి గ్లామర్ రోల్స్ వరకు.. అమాయకురాలి లుక్స్ నుంచి అల్ట్రా మోడర్న్ వరకు అన్నిటినీ చేసేస్తూ.. ట్యాలెంట్ చూపిస్తున్న తేజస్వి మదివాడకు.. ఇప్పుడు ఓ లక్కీ ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. తెలుగుతోపాటు తమిళ్ లో కూడా సత్తా చాటుతున్న సందీప్ కిషన్ సరసన ఓ తెలుగు-తమిళ్ బైలింగ్యువల్ లో ఆఫర్ వచ్చింది. కార్తీతో నాపేరు శివ చిత్రాన్ని దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందనున్న మూవీలో తేజస్విని పరిశీస్తున్నారు. ఈ సినిమా ద్వారా తమిళ్ లో కూడా సత్తా చాటే అవకాశం తేజస్వి మదివాడకు రానుంది.

'తేజస్వి యాక్ట్ చేయడం ఇంకా ఫైనల్ కాకపోయినా.. ఒక రోల్ కు ఆమెనే బెస్ట్ ఛాయిస్ అనుకుంటున్నాయి. సందీప్ కిషన్ తో పాటు సినిమా అంతా ఉండే రోల్ ఇది. చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది' అని చెబుతున్నారు నిర్మాతలు. ఈ మూవీలో కృష్ణగాడి వీర ప్రేమగాధ ఫేమ్ మెహ్రీన్ కౌర్ పీర్జాడా లీడ్ హీరోయిన్ పాత్ర చేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/