బిగ్ బాస్ లో తేజస్వి రెమ్యునరేషన్.. బీప్

Thu Jun 14 2018 12:30:50 GMT+0530 (IST)

టాలీవుడ్ జనాలకు బిగ్ బాస్ అలవాటు సెకండ్ సీజన్ కి కూడా బాగా ఎక్కేసింది. మొదటి సీజన్ తారక్ తో మంచి క్రేజ్ వచ్చింది. అయితే సెకండ్ సీజన్ నాని రావడంతో అంతగా వర్కౌట్ అవ్వదని ఓ టాక్ వచ్చింది. మొదటి రోజు కంటెస్టెంట్స్ ని చూసిన తరువాత జనాలకి ఓ రకంగా చిరాకు వచ్చేసింది. ఎవరో వస్తారు అనుకుంటే రొటీన్ వాళ్లనే తీసుకు వచ్చారని టాక్ వైరల్ అయ్యింది. కానీ సెకండ్ రోజు కంటెస్టెంట్స్ లో మార్పులు రావడం ఎత్తులు వేయడం అందరిలో ఆసక్తిని రేపుతోంది.ముఖ్యంగా బాబు గోగినేని ఎవరు ఊహించని కోణంలో కనిపించడం హైలెట్ అవుతోంది. సంజన తేజస్వి కూడా ఎవరి స్థాయిలో రాణిస్తున్నారు. ఇకపోతే తేజస్వి ఈ షోలో బాగా క్లిక్ అవుతుందనే చెప్పాలి. బిగ్ బాస్ లో అప్పుడపుడు కొందరు కెమెరా ఉంటుందని తెలియకుండా వ్యక్తిగత విషయాలను చెప్పేసుకుంటారు. ఆ విధంగానే తేజస్వి తన జీవితాన్ని గురించి చెబుతూ అలాగే ఇన్ కమ్ సోర్సెస్ గురించి తెలిపింది.

మొదట తన సినిమా అవకాశాల గురించి చెబుతూ..మొదట సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత డబ్బు కోసం జాబ్ చేయాల్సివచ్చింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసినప్పుడు రోజుకి 12 వేలు మాత్రమే వచ్చేవి.  ఆ తరువాత ఎక్కువగా ఆ పని వర్కౌట్ కాలేదు. డైరెక్ట్ మంచి గుర్తింపు ఉన్న అవకాశాల కోసం ట్రై చేయాలనీ జాబ్ వదిలేశాను. ఇక ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నందుకు **** ఇస్తున్నారని చెప్పింది. అర్ధమయ్యింది కదా తేజస్వి ఏం చెప్పిందో.

తనకు రోజుకు ఇస్తున్న ఎమౌంట్ గురించి చెప్పింది. కానీ ఎడిటింగ్ లో బీప్ సౌండ్ వేశారు. అంటే రోజుకి వీళ్లకు కొంత అందుతుందన్న మాట నిజమే. ఇక బిగ్ బాస్ కు స్టార్ మా సోషల్ మీడియా ద్వారా మరింత క్రేజ్ పెంచుతోంది. ఇతర మీడియాల్లో కూడా షో గురించి ప్రత్యేక కథనాలు వెలువడుతుండగా పలువురు కంటెస్టెంట్ లుషాపై భిన్నంగా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారింది.