తన ఎలిమినేషన్ పై తేజస్వి షాకింగ్ కామెంట్స్!

Mon Jul 23 2018 22:13:47 GMT+0530 (IST)

బిగ్ బాస్-2 హౌస్ నుంచి నటి తేజస్వి మదివాడ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే తేజస్వితో పాటు ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన ఆరుగరు హౌస్ మేట్స్ లో ఒకరికి రీఎంట్రీ చాన్స్ ఉంటుందని బిగ్ బాస్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్ ఓటింగ్ ద్వారా ఒకరికి రీఎంట్రీ ఉంటుందని నాని ప్రకటించాడు. ఈ నేపథ్యంలో దాదాపుగా తేజస్వి మదివాడకు ఎక్కువ ఓట్స్ వస్తాయని....పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తేజస్వి తన ఫేస్ బుక్ లో షాకింగ్ వీడియో పోస్ట్ చేసింది. బిగ్ బాస్ లో ఒక రోజులో జరిగిన మొత్తం ఘటనలన్నింటినీ కలిపి గంట సేపు చూపించారని - ఆ గంట వీడియో చూసి ఆడియన్స్ తనను నెగెటివ్ గా జడ్జ్ చేసి ఎలిమినేట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది.  అవి నిజాలు కాదని - తాను అరిచిన విషయాలే బిగ్ బాస్ లో చూపించారని ఆరోపించింది. చాలాసార్లు కౌశల్ కు సారీ చెప్పిన వీడియో ఎందుకు చూపించలేదని ప్రశ్నించింది. కౌశల్ తో తాను గొడవ పడలేదని - వేరే అమ్మాయిపై అతడు చెయ్యి వేస్తే ప్రశ్నించినందుకు కౌశల్ ఆర్మీ తనను టార్గెట్ చేసిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే కౌశల్ ఆర్మీ హేటింగ్ గురించి తెలిసిందని చెప్పింది. ఏదైనా విషయం జరిగిన తర్వాతే తాను కౌశల్ పై కోప్పడి ఉంటానని - అంతకు ముందు ఏం జరిగిందో బిగ్ బాస్ వాళ్లు చూపించలేదని ఆరోపించింది. 24 గంటలపాటు కౌశల్ ఆర్మీ హౌస్ లోపల ఉంటే వారే అతడిని చంపి బటయకు తీసుకొస్తారని సంచలన వ్యాఖ్యలు చేసింది. 24 గంటలు షో ప్రసారం చేస్తే కౌశల్ ఏం చేస్తున్నాడో అందరికీ తెలుస్తుందని చెప్పింది. తాను ఒక్క బూతు మాట్లాడినందుకే వందల బూతులు తిడుతూ ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు మరో చాన్స్ ఇవ్వాలని - తనను మళ్లీ షోలో చూడాలనుకుంటే ఓటింగ్ లో గెలిపించాలని రిక్వెస్ట్ చేసింది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తేజస్వి హౌస్ లో ఉంటే కుటుంబంతో కలిసి షో చూడలేకపోయామని - తేజస్వి రీ ఎంట్రీ తట్టుకోలేమని కామెంట్స్ పెడుతున్నారు. మరి తేజస్వి నామినేట్ అవుతుందో లేదో తెలియాలంటే....వెయిట్ చేయక తప్పదు.