ఫోటో స్టొరీ: డోస్ పెంచిన తెలుగు బ్యూటీ

Thu Dec 06 2018 15:38:34 GMT+0530 (IST)

సినిమాల్లో తెలుగు హీరోయిన్లకు పెద్దగా అవకాశాలు రావంటారు గానీ కొంతమందికి అవకాశాలు వచ్చినా లక్కు తోడుగా లేకపోవడంతో బిగ్ లీగ్ కు చేరలేరు.  సైడ్ క్యారెక్టర్లతో తన కెరీర్ మొదలుపెట్టి స్లోగా హీరోయిన్ గా మారిన తేజస్వి మదివాడకు హీరోయిన్ అవకాశాలు వచ్చినా ఆ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో కెరీర్ ముందుకు సాగలేదు. ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి.  కానీ బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేయడంతో మళ్ళీ కాస్త పాపులారిటీ పెరిగింది. ఈ కొత్త గుర్తింపు తో ఒక కామెడీ షోకు హోస్ట్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే. మళ్ళీ సినిమాలో అవకాశాల కోసం తనవైపు నుండి ఫుల్ గా ప్రయత్నాలు మొదలుపెట్టింది.   హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆ ఫోటోలను పోస్ట్ చేస్తోంది.  మరి ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు ఏదో ఒకటి చేయాలిగా.  

తాజాగా తన ఇన్స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఒక హాటు పిక్కు పోస్ట్ చేసింది.  దానికి ఆమె ఇచ్చిన క్యాప్షన్ 'మూడ్'.  వైట్ కలర్లో డిజైన్ ఉన్న ఇన్నర్.. పైనేమో బటన్లు తీసేసిన తెల్ల చొక్కాతో ఫుల్ గా క్లీవేజ్ షో చేసింది. వెడల్పాటి సన్నని చెవి రింగులు.. చేతికి రిస్ట్ బ్యాండ్స్ తో ఒక హాటు లుక్ ఇచ్చింది. బ్యాక్ గ్రౌండ్ అంతా వైట్ గా ఉండడంతో  వనిల్లా ఐస్ క్రీమ్(కొంత మంది వెనిల్లా అని ఇంకొందరు.. వెన్నెల అని అంటారు. మీకేది నచ్చితే అదే అనుకోండి) లాగా కనిపిస్తోంది. కాకపోతే ఒకటే తేడా. ఆ ఐస్ క్రీమ్ కూలు.. ఈ ఐసు క్రీము హాటు.. యమా హాటు!