తేజ టైటిల్ క్రెడిట్ వెనక లాజిక్ అదేనట

Sun May 19 2019 17:41:28 GMT+0530 (IST)

ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో స్టైల్ ఉంటుంది. ఒకరు ముఖేష్ యాడ్ అయిపోగానే స్టొరీ మొదలెడతారు..ఒక పది నిముషాలు షాక్ ఇచ్చి ఆ తర్వాతా టైటిల్స్ వేస్తారు. కొందరేమో ముఖేష్ యాడ్ తర్వాత టైటిల్స్ వేసి ఆ తర్వాత సినిమాను మొదలుపెడతారు. అయితే దర్శకుడు తేజది మరోరకమైన స్టైల్.. టైటిల్స్ అన్నీ మొదట్లోనే వేస్తాడు కానీ  తన టైటిల్ కార్డ్ మాత్రం ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందు వేస్తాడు. ముఖేష్ యాడ్ సినిమాల్లో లేని కాలం నుంచి అయన సంప్రదాయం ఇదే!అయితే ఇంటర్వెల్ కు ముందుగా ఎందుకు తన పేరు వేసుకుంటాడు.. అందులో ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా అనేది ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు.  తాజాగా ఒక ఇంటర్వ్యూలో తేజ ఈ విషయం గురించి తెలిపాడు. ఈ సినిమాకు డైరెక్టర్ తేజ అనే ఉద్దేశంతో ఆడియన్స్ సినిమాను మొదలుపెట్టడం తేజకు ఇష్టం లేదట. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి సినిమాపై ఒక అవగాహన వస్తుందని.. ఒకవేళ సినిమా బాగుంటే ఇది తేజ సినిమా అనే ఉద్దేశంతో సెకండ్ హాఫ్ చూడవచ్చని.. అలా కాకుండా సినిమా చెత్త అయినా ఆ బాధ్యత తేజది అని ప్రేక్షకులకు చెప్పినట్టు ఉంటుందనే అలోచనతో ఇలా చేస్తానని వివరించాడు.

ఇదిలా ఉంటే తేజ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'సీత' మే 24 రిలీజ్ కానుంది.  బెల్లంకొండ శ్రీనివాస్.. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు. మన్నార చోప్రా.. సోను సూద్.. అభిమన్యు సింగ్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు.